కేరళలో విషాదం... పడుకున్న వ్యక్తి మీదినుంచి వెళ్లిన రోడ్డు రోలర్..
రోడ్డు రోలర్ ముందు పడుకున్న వ్యక్తి మీదినుంచి రోలర్ వెళ్లడంతో మృతి చెందిన ఘటన కేరళలో వెలుగు చూసింది.

కేరళ : కేరళలోని కొల్లాంజిల్లాలోని ఆంచల్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిద్రిస్తున్న ఓ ముప్పై ఏళ్ల వ్యక్తిపైకి రోడ్డు రోలర్ దూసుకెళ్లడంతో మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. రోడ్డు రోలర్ కు సమీపంలో పడుకున్నాడని ప్రమాదవశాత్తు ఇది జరిగిందని తెలిపారు.
ఆంచల్ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ వ్యక్తి నివాసం ఉంది. ఘటన జరిగిన రోు చేపలు పట్టేందుకు అక్కడికి వచ్చానని అంచల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. "అతనికి మద్యం అలవాటు ఉంది. రోడ్ రోలర్ ముందు నిద్రపోయినప్పుడు అతను తాగి ఉన్నాడా? అని మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లు మార్చిన మహా సర్కార్.. ఇక నుంచి వాటిని ఏమని పిలవాలంటే ?
ఈ ఘటన మీద ఐపీసీ సెక్షన్ 304ఏ (నిర్లక్ష్యం కారణంగా మరణం) కింద కేసు నమోదు చేశాం. దీనిమీద విచారణ ప్రక్రియ ప్రారంభమైంది" అని చెప్పారు. ఇదిలా ఉండగా, రోడ్డు రోలర్ డ్రైవర్‌ను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని, అయితే ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
"అతను తప్పు చేసినట్లు కనిపించడం లేదు. కానీ, తదుపరి తీసుకోవాల్సిన చర్యలకు ముందు పోస్ట్ మార్టం ఫలితాల కోసం వేచి ఉంటాం" అని అధికారి తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న అంచల్ బైపాస్ సమీపంలోని కురిశుముక్కు వద్ద రోడ్డు రోలర్‌ను నిలిపి ఉంచారని, శుక్రవారం రాత్రి 11 గంటలకు వాహనాన్ని పార్క్ చేసిన చోటు నుంచి తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడు వాహనం ముందు పడుకుని ఉండడం డ్రైవర్ చూడలేదని తెలిపాడన్నారు.