నిద్రిస్తున్న కుక్కపై సలసలా కాగుతున్న తారు.. ఆపైన రోడ్డు

Road built on Dog at Agra
Highlights

నిద్రిస్తున్న కుక్కపై సలసలా కాగుతున్న తారు.. ఆపైన రోడ్డు

మనిషి రోజు రోజుకు కఠినాత్ముడుగా మారిపోతున్నాడు.. మనుషులనే కాదు.. చివరికి మూగజీవాలు కూడా తన తోటి ప్రాణులనే విషయాన్ని మరిచిపోయి అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నిద్రిస్తున్న కుక్కను పక్కకు అదిలించకుండా దాని మీదే రోడ్డు వేశారు కొందరు దుర్మార్గులు.

ఆగ్రాలోని ఫూల్ సయ్యద్ క్రాస్ రోడ్ నుంచి సర్క్యూట్ హౌజ్.. తాజ్‌మహాల్‌ల మీదుగా రోడ్డు నిర్మాణం సాగుతోంది.. ఆర్‌పీ ఇన్‌ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్‌ కాంట్రాక్ట్  పనులను దక్కించుకుంది. అప్పటికే వేసి ఉంచిన రోడ్డుపై కోల్ తారును మరో రౌండ్ ‌పూత వేస్తూ వచ్చిన వర్కర్లకు రోడ్డుపై నిద్రపోతున్న కుక్క కనిపించింది. దానిని లేపి పక్కకు తోలకుండా అలాగే దాని శరీరంపై సలసలా  కాగుతున్న తారును వేశారు..

ఈ విషయం ఆ నోటా ఈ నోటా జనానికి తెలియడంతో కుక్క మృతదేహాన్ని కనిపించకుండా చేశారని ఓ సామాజిక కార్యకర్త ఆరోపించారు.. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన ప్రజలు కుక్క మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 
 

loader