నూతన సంవత్సరం వేళ ఝార్ఖండ్​లో పెను విషాదం చోటు చేసుకుంది. పాలము జిల్లా పంకీ గ్రామానికి చెందిన కూలీలు శుక్రవారం సాయంత్రం సొంతూరుకు తిరిగి వస్తున్న కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు.

Road accident: నూత‌న‌ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఝార్ఖండ్​లో పెను విషాదం చోటుచేసుకుంది. పొట్ట‌కూటి కోసం ప‌క్క రాష్ట్రానికి వెళ్లి.. స్వ‌గ్రామానికి తిరిగి వ‌స్తున్న వేళ‌ కూలీల‌ను రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్లోని పాలము జిల్లాలో జరిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. ఝార్ఖండ్​లోని పాలము జిల్లా పంకీ గ్రామానికి చెందిన కూలీలు ప‌ని నిమిత్తం.. బిహార్​లోని సిహుడీ గ్రామం వెళ్లారు. శుక్రవారం సాయంత్రం కూలీలంద‌రూ స్వ‌గ్రామానికి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్​ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్కడికక్కడే మ‌ర‌ణించ‌గా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరోవైపు గాయపడిన 18 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.