జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీ2 టన్నెల్ మారోగ్ రాంబన్ సమీపంలో ఆర్మీ వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది పోలీసులు, ముగ్గురు మహిళా ఖైదీలు గాయపడ్డారు.  

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు ఆర్మీ వాహనం, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది పోలీసులు, ముగ్గురు మహిళా ఖైదీలు గాయపడ్డారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు నుంచి భద్రవ్ జైలుకు వెళ్తున్న బస్సు టీ2 టన్నెల్ మారోగ్ రాంబన్ సమీపంలో ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.

పోలీసు సిబ్బందిలో మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని తెలిపారు. మహిళా ఖైదీలతో సహా గాయపడిన వారందరినీ రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.