Asianet News TeluguAsianet News Telugu

రిషబ్ పంత్ హెల్త్ అప్‌డేట్.. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కు ఎంఆర్ఐ .. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ !

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రిషబ్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడిని డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చారు.  

Rishabh Pant Accident: Star Cricketer's Brain, Spinal Cord MRI Normal, Undergoes Plastic Surgery
Author
First Published Dec 30, 2022, 11:12 PM IST

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. అంతే కాకుండా వెన్ను, కాళ్లలో కొన్ని భాగాల్లో గాయాలయ్యాయి. రూర్కీ సమీపంలోని మహ్మద్‌పూర్ జాట్ ప్రాంతంలో పంత్ ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత ఒక బస్సు డ్రైవర్ దూతగా మారి రిషబ్ పంత్ జీవితాన్ని కాపాడాడు. డ్రైవర్ ముందుగా బస్సును ఆపి రిషబ్ పంత్‌ను కారులో నుంచి తీసుకెళ్లాడు.

అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. రిషబ్ పంత్ కారులో తన సొంత పట్టణం రూర్కీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతను కారుపై అదుపు కోల్పోడంతో.. కారు డివైడర్‌ను ఢీ కొన్నాడు. దీంతో వెంటనే కారులో ఎయిర్ బెలున్స్ బయటకు వచ్చాయి. లేకపోతే.. ప్రమాదం మరింత భయంగాకరంగా ఉండేది. అనంతరం పంత్ స్వయంగా కారు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చాడు. అనంతరం కారులో భారీగా మంటలు చెలరేగాయి.  

రిషబ్ పంత్ హెల్త్ అప్‌డేట్

తొలుత పంత్ ను డెహ్రాడూన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్‌కు తరలించబడ్డాడు.ఇక్కడే అతని చికిత్స పొందుతున్నాడు. కొద్ది నిమిషాల క్రితమే.. రిషబ్ పంత్  హెల్త్ అప్ డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం.. రిషబ్ పంత్ మెదడు,వెన్నుకు  ఎంఆర్ఐ (MRI) స్కాన్ చేశారు. ఈ స్కానింగ్ ఫలితాలలో అన్నీ సాధారణ స్థితిలో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రిషబ్ నుదుటిపై రెండు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ చిక్సితలో భాగంగా అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు తెలుస్తుంది. 

పంత్ కుడి మోకాలిలో లిగమెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు, కుడి మణికట్టు, చీలమండ, బొటనవేలుకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. వీటికి తీవ్ర నొప్పి ఉంటడంతో రేపు( శనివారం) చీలమండ, మోకాలికి MRI చేయనున్నారు. వాటి ఫలితాల తర్వాత వైద్యం కొనసాగనున్నది. 
  
రిషబ్ పంత్ ఆరోగ్యానికి సంబంధించి బీసీసీఐ కూడా తాజా అప్‌డేట్ ఇచ్చింది. రిషబ్‌ ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను బీసీసీఐ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. బోర్డు మీడియా ప్రకటనను ట్వీట్ చేసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో శుక్రవారం ఉదయం భారత వికెట్‌కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు' అని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. అతనికి సక్షం హాస్పిటల్ మల్టీస్పెషాలిటీ,ట్రామా సెంటర్‌లో చిక్సిత జరుగుతున్నట్టు తెలిపింది.  

రిషబ్ నుదుటిపై రెండు చోట్ల తీవ్ర గాయాలయ్యాయనీ,కుడి మోకాలిలో లిగమెంట్లు దెబ్బతిన్నదనీ, కుడి మణికట్టు, చీలమండ, బొటనవేలు కూడా గాయపడ్డాయని బోర్డు పేర్కొంది. ప్రస్తుతం   రిషబ్ పరిస్థితి నిలకడగా ఉందనీ, అతన్ని ఇప్పుడు డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొంది.  బిసిసిఐ రిషబ్ కుటుంబంతో టచ్‌లో ఉంది, అయితే రిషబ్‌కు చికిత్స చేస్తున్న వైద్యులతో వైద్య బృందం కూడా వారితో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు బోర్డు పేర్కొంది. రిషబ్‌కు అత్యుత్తమ వైద్యం అందేలా బోర్డు జాగ్రత్తలు తీసుకుంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios