ఇండియా నుంచి పెరుగుతోన్న పేటెంట్ ఫైలింగ్ .. భారతీయ యువతపై మోడీ ప్రశంసలు
భారతదేశంలో పేటెంట్ దరఖాస్తుల పెరుగుదల మన యువతలో పెరుగుతున్న ఉత్సాహానికి నిదర్శనమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాబోయే కాలానికి ఇది చాలా సానుకూల సంకేతంగా మోడీ అభివర్ణించారు.
భారతదేశంలో పేటెంట్ దరఖాస్తుల పెరుగుదల మన యువతలో పెరుగుతున్న ఉత్సాహానికి నిదర్శనమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాబోయే కాలానికి ఇది చాలా సానుకూల సంకేతంగా మోడీ అభివర్ణించారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ నివేదికపై బుధవారం ఆయన స్పందిస్తూ.. 2022లో భారతదేశం నుంచి పేటెంట్ దరఖాస్తులు 31.6 శాతం పెరిగాయని, టాప్ 10 ఫైలర్‌లలో మరే ఇతర దేశంతో పోల్చలేని 11 సంవత్సరాల వృద్ధిని విస్తరించిందని నివేదిక పేర్కొంది.
చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీలు 2022లో అత్యధికంగా పేటెంట్ ఫైలింగ్‌లను కలిగి వున్న దేశాలు అని నివేదిక తెలిపింది. చైనాకు చెందిన ఆవిష్కర్తలు దాదాపు అన్ని గ్లోబల్ పేటెంట్ అప్లికేషన్‌లలో దాదాపు సగానికి పైగా దరఖాస్తులను దాఖలు చేస్తున్నారు. కానీ ఆ దేశ వృద్ధి రేటు 2021లో 6.8 శాతం నుంచి 2022లో 3.1 శాతానికి పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది.