పశ్చిమబెంగాల్ లోని బెంగాల్ సఫారీ పార్క్ (Bengal Safari Park) లో 'రికా' (Tigress Rika) అనే పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. రికా ఆగస్టు 19న ఆ మూడు పిల్లలకు జన్మనిచ్చిందని అధికారులు వెల్లడించారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్‌గురి జిల్లాలోని సిలిగురి పట్టణ సమీపంలోగల బెంగాల్ సఫారీ పార్కు (Bengal Safari Park) నుంచి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. పార్కు సందర్శించే పర్యాటకులను అలరించే పెద్దపులి ‘రికా’ (Tigress Rika) మరోసారి ప్రసవించింది. ఒకే కాన్పులో ఈ పెద్దపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆగస్టు 19న పెద్దపులి రికా మూడు పులి కూనలు జన్మనిచ్చిందని బెంగాల్ సఫారీ పార్క్ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఎన్‌క్లోజర్‌లో ఉన్న తల్లీ రికా(Tigress Rika), దాని పిల్లలు సఫారీ పార్కులో సందడి చేస్తున్నాయి. వీటికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయినా వీడియోను బెంగాల్ సఫారీ పార్కు అధికారులు విడుదల చేశారు. ఈ వీడియోలో పెద్దపులి రికా, దాని మూడు పిల్లలను చూడవచ్చు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
మీరు కూడా ఓ లూక్కేయండి..
అంతకుముందు బెంగాల్ సఫారీ పార్క్‌లోని కికా అనే తెల్లపులి జూలై 12న రెండు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, రెండు పిల్లలు చనిపోయాయి.
