Asianet News TeluguAsianet News Telugu

ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షల వాయిదాకు సుప్రీంలో పిటిషన్

ఐఐటీ- జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
 

Review Petition for JEE, NEET 2020 Postponement filed in Supreme Court
Author
New Delhi, First Published Aug 28, 2020, 4:34 PM IST

న్యూఢిల్లీ: ఐఐటీ- జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.

ఇటీవల బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఐటీ జేఈఈ., నీట్ పరీక్షల విషయమై చర్చించారు.ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం షెడ్యూల్ విడుదల చేసింది.

also read:సెప్టెంబర్ 30 లోపుగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు పరీక్షలు: సుప్రీంకోర్టు ఆదేశం

ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఈ తీర్పుపై ఆరు రాష్ట్రాలు ఇవాళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రాష్ట్రాల తరపున  న్యాయవాది సునీల్ ఫెర్నాండెస్ పిటిషన్ దాఖలు చేశారు.

కరోనా నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ఈ రాష్ట్రాలు ఈ పిటిషన్ లో పేర్కొన్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్షలను నిర్వహించాలని  కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా  161 పరీక్షా కేంద్రాల్లో  పరీక్షలను నిర్వహించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios