న్యూఢిల్లీ: ఫైనల్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపుగా నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది.  ఫైనల్ పరీక్షల విషయంలో యూజీసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేయడానికి వీల్లేదని యూజీసీ సూచనను సుప్రీంకోర్టు సమర్ధించింది.గతంలో విద్యార్ధులకు  వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఫైనల్ పరీక్షల్లో పాస్ చేయలేరని సుప్రీం తేల్చి చెప్పింది.

కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకూడదని  సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.

కాలేజీ, వర్శిటీల చివరి ఏడాది విద్యార్థుల పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీలోపుగా నిర్వహించాలని తేల్చి చెప్పింది. చివరి ఏడాది పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు డిగ్రీలు ఇవ్వడానికి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేవని సుప్రీం అభిప్రాయపడింది. పరీక్షల నిర్వహణకు గడువును పొడిగించాలని రాష్ట్రాలు కోరుకొంటే దానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

మరో వైపు  సెప్టెంబర్ 20వ తేదీలోపుగా పరీక్షలు నిర్వహించలేమని భావిస్తే యూజీసీని సంప్రదించవచ్చని సుప్రీంకోర్టు రాష్ట్రాలను కోరింది.మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సహా పలువురు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.