శ్రీనగర్:జమ్మూ లో ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టుగా జమ్మూ కాశ్మీర్ అదనపు డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. కాశ్మీర్ లో మాత్రం మరికొన్ని రోజులపాటు ఆంక్షలు ఉంటాయని ఆయన ప్రకటించారు.రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆయన తెలిపారు.

శ్రీనగర్ లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకొన్నా ఎవరికీ గాయాలు కాలేదని ఆయన చెప్పారు.సామాన్యులకు ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశ్యంలోనే  ఆంక్షలు విధించినట్టుగా మునీర్ ఖాన్ చెప్పారు.

ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేసేందుకు గతంలో చోటు చేసుకొన్న విధ్వంసకర వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని ఆయనచెప్పారు. ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. 

కాశ్మీర్  రాష్ట్రంలో 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.  అంతేకాదు జమ్మూ కాశ్మీర్, లడఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ తరుణంలో  ఈ ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. భారీగా ఆర్మీని రంగంలోకి దించారు.
 

సంబంధిత వార్తలు

ఇండియాపై జీహాద్ చేయాల్సిందే: పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు

ప్రాణత్యాగానికి సైతం వెనుకాడం: పాక్ కి కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ వార్నింగ్