చండీగఢ్‌: పంజాబ్ సైనికులపై పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్. పాక్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు కట్టిపెట్టాలంటూ వార్నింగ్ ఇచ్చారు. 

కశ్మీర్ లో పంజాబ్ సైనికులు విధులు నిర్వర్తించొద్దంటూ పాక్ మంత్రి ఫవాద్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలను తిప్పటికొట్టారు. మాకు మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ ట్విట్టర్ వేదికగా బుద్ధి చెప్పారు.  

అంతేకాదు కశ్మీర్‌లో పంజాబ్‌ సైనికులు విధులు నిర్వర్తించొద్దంటూ పాక్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి అసహనం, కుయుక్తులకు నిదర్శనమంటూ మండిపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని పంజాబ్‌ సైనికులు గొప్ప దేశభక్తులని సిమ్రత్ కౌర్ కొనియాడారు. 

 

పాక్ మంత్రి ఫవాద్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తోపాటు నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే వ్యాఖ్యలపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ సైతం స్పందించారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపేయాలని పాక్ కు తేల్చి చెప్పారు. అర్థంపర్థంలేని ట్వీట్లు చేయోద్దని హెచ్చరించారు సీఎం అమరీందర్ సింగ్. 

ఈ వార్తలు కూడా చదవండి

జమ్మూలో ఆంక్షల ఎత్తివేత: కాశ్మీర్ లో యథాతథం
 ఇండియాపై జీహాద్ చేయాల్సిందే: పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు