Asianet News TeluguAsianet News Telugu

1985 లో రెస్టారెంట్ బిల్లు... నెటిజన్లు షాక్...!

ఒక్కరి కడుపు నిండాలన్నా.. కనీసం రూ.వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. రెస్టారెంట్ లో ఫుడ్ బిల్లుకు తోడు... అదనపు ట్యాక్సులు కూడా ఉంటాయి.

Restaurant Shares Bill From 1985, Shocks Internet Users
Author
First Published Nov 23, 2022, 11:29 AM IST


మనలో చాలా మంది రెస్టారెంట్లు లేదా కేఫ్‌లలో ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. రోజూ ఇంట్లో ఆహారం తినడానికి బోరింగ్ గా అనిపించి... బయటకు వెళ్లి తినాలి అని అనుకుంటూఉంటారు. కానీ.... రెస్టారెంట్ కి వెళితే.. జేబుకు చిల్లు పడటం ఖాయం.  అక్కడ ఫుడ్ ఖరీదు అలా ఉంటుంది. మరి.. ఒక్కరి కడుపు నిండాలన్నా.. కనీసం రూ.వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. రెస్టారెంట్ లో ఫుడ్ బిల్లుకు తోడు... అదనపు ట్యాక్సులు కూడా ఉంటాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ కి వెళ్లినా...ఒక భోజనానికి దాదాపు ₹ 1,000-1,200 ఖర్చవుతుంది. అయితే దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ధర గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రెస్టారెంట్ 1985 నుండి సుమారు 37 సంవత్సరాల క్రితం బిల్లును షేర్ చేసింది. ఇది చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.

 

వాస్తవానికి 2013 ఆగస్టు 12న ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలో ఉన్న లాజీజ్ రెస్టారెంట్ & హోటల్ డిసెంబర్ 20, 1985 నాటి బిల్లును షేర్ చేసింది. బిల్లులో చూపిన విధంగా కస్టమర్ ఒక ప్లేట్ షాహీ పనీర్, దాల్ మఖ్నీ, రైతా, కొన్ని చపాతీలను ఆర్డర్ చేశారు. వస్తువుల ధర మొదటి రెండు వంటకాలకు రూ.8, మిగిలిన రెండింటికి వరుసగా రూ.5, రూ. 6 గా ఉండటం గమనార్హం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బిల్లు మొత్తం రూ.26 కావడం గమనార్హం. ఇది నేటి కాలంలో ఒక చిప్స్ ప్యాకెట్ ధరకు సమానం.

షేర్ చేసినప్పటి నుండి ఈ పోస్ట్‌కి 1,800 లైక్‌లు, 587 షేర్లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఇదే విషయాన్ని చూసి అవాక్కయ్యారు. ఒక వినియోగదారు, "OMG... అది చాలా చౌకగా ఉండేది... అవును అయితే ఆ రోజుల్లో డబ్బు విలువ చాలా ఎక్కువ...." అని కొందరు కామెంట్ చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios