Asianet News TeluguAsianet News Telugu

Republic day: శకటాల వివాదం... ఎంపిక నిర్ణయం నిపుణులదే..!

రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే శకటాల ఎంపిక విషయంలో  నిపుణుల కమిటీదే తుది నిర్ణయమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Republic Day 2022 tableau row: Modi government does not decide on tableau, expert panel does, say sources
Author
New Delhi, First Published Jan 17, 2022, 9:31 PM IST

న్యూఢిల్లీ: Republic Day  సందర్భంగా  ప్రదర్శనకు ఎంపిక  Tableau నిపుణుల బృందం ఎంపిక చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ పేరేడ్ కు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా తమపై నిందలు వేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. 

ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శకటాల ఎంపిక విషయంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రంపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్రం చెబుతుంది.

 శకటాలను ప్రదర్శనకు ఎంపిక చేయకపోతే  రాష్ట్రాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ రకమైన పరిస్థితి సమాఖ్య వ్యవస్థకు హాని కలుగుతుందని కేంద్రం అభిప్రాయపడుతుంది.

 కళ, సంస్కృతి, సంగీతం, వాస్తు శిల్పం, కొరియోగ్రఫీ మొదలైన రంగాల్లోని ప్రముఖులతో కలిగిన నిపుణుల కమిటీ Republic పరేడ్ లో  శకటాలను అనుమతించాలా వద్దా అని నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాన్సెప్ట్, థీమ్, డిజైన్, విజువల్ ఇంపాక్ట్ ఆధారంగా ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కోసం రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి మొత్తం 56 ప్రతిపాదనలు అందాయి. అయితే ఇందులో 21 మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. సమయం తక్కువగా ఉన్నందున ఎక్కువ ప్రతిపాదనలు తిరస్కరించినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

kerala , Tamilnadu,West Bengal రాష్ట్రాల ప్రతిపాదనలను పలు చర్చల తర్వాతే నిపుణుల కమిటీ తిరస్కరించింది. ఇదే తరహలోనే 2018, 2021లలో కేరళ శకటానికి అనుమతి ఇచ్చినట్టుగా అధికారులు చెప్పారు. మరో వైపు 2016, 2017, 2019,2020,2021లో తమిళనాడు శకటానికి ఆమోదం లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.2016, 2017, 2019, 2021లలో బెంగాల్ శకటాలు రిపబ్లిక్ పరేడ్ కోసం ఆమోదం పొందాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తమ రాష్ట్రాల శకటాలను అనుమతించాలని  ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు కూడా రాశారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కూడా కోరారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ శకటాన్ని అనుమంతించాలని బీజేపీ నేత తథాగత రాయ్ ప్రధానిని కోరిన విషయం తెలిసిందే.ఈమేరకు ట్విట్టర్ వేదికగా ప్రధానిని కోరారు. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరామక్రమ్ దివస్ గా జరుపుకోవడానికి కేంద్రం ఎలా ప్రారంభించిందో త్రిపుర మాజీ గవర్నర్ గుర్తు చేసుకొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 24 నుండి కాకుండా 23 నుండే ప్రారంభమౌతాయన్న వాస్తవాన్ని అంగీకరిస్తూనే ఈ విషయమై ఏ ప్రభుత్వం క్లైయిమ్ చేసుకోవడానికి అనుమతించవద్దని ప్రధానిని కోరింది

Follow Us:
Download App:
  • android
  • ios