Asianet News TeluguAsianet News Telugu

Republic Day 2022: ప్రజలకు ప్ర‌ధాని మోడీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ! గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో సైనికుల వేడుక‌లు !

Republic Day 2022:  భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సారి జ‌రుగుతున్న రిపబ్లిక్ డే 2022 వేడ‌క‌ల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు.
 

Republic Day 2022: President Kovind To Hoist National Flag, PM Modi Greets Nation On R-Day
Author
Hyderabad, First Published Jan 26, 2022, 8:55 AM IST

Republic Day 2022:  భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సారి జ‌రుగుతున్న రిపబ్లిక్ డే 2022 వేడ‌క‌ల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ (Republic Day 2022) శుభాకాంక్ష‌లు తెలిపారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాధారణంగా జనవరి 24 నుండి ప్రారంభమవుతాయి, అయితే, ఈ సంవత్సరం నుండి అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ (netaji subhas chandra bose) జయంతిని పుర‌ష్క‌రించుకుని జనవరి 23 నుండి గ‌ణ‌తంత్ర వేడుక‌లు (Republic Day) నిర్వ‌హిస్తోంది ప్ర‌భుత్వం.

 

దేశ వ్యాప్తంగా 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు  (Republic Day 2022)  ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. అత్యంత చ‌ల్ల‌ని ఉష్ణోగ్ర‌త‌ల మ‌ధ్య ఇండో – టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసులు రిప‌బ్లిక్ వేడుక‌ల‌ (Republic Day 2022) ను నిర్వ‌హించారు. 1500 అడుగుల ఎత్తులో మైన‌స్ 35 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లో జ‌వాన్లు జాతీయ జెండాతో క‌వాతు నిర్వ‌హించారు. జ‌వాన్లు జాతీయ జెండాను రెప‌రెప‌లాడించారు. ఈ వీడియో  (Republic Day 2022) ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో వైర‌ల్ గా మారింది. 


గ‌ణంత్ర దినోత్స‌వ వేడుక‌ల  (Republic Day 2022) ఈ కింది షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గ‌నున్నాయి. 

ఉదయం 10.05: జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పిస్తారు.

ఉదయం 10.15: రాజ్‌పథ్ చేరుకోనున్న ప్రధాని.

ఉదయం 10.18: రాజ్‌పథ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (ఆయ‌న‌ ఇటీవలే కరోనా బారిన పడినందున వేదిక వద్దకు చేరుకోకపోవచ్చు.)

10.23: రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(President Kovind).

ఉదయం 10.26: జెండా ఎగురవేయడం, జాతీయ గీతాలాప‌న 

ఉదయం 10.28: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్మూ కాశ్మీర్ పోలీసు ఏఎస్‌ఐ బాబు రామ్‌కు మరణానంతరం అశోక్ చక్ర ప్రదానం చేయనున్నారు. ఆయన సతీమణి రీటా రాణి బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఉదయం 10.30: వైమానిక దళానికి చెందిన నాలుగు హెలికాప్టర్లు ఆకాశం వీధుల్లో సంద‌డి చేయ‌నున్నాయి.  ఒకదానిపై త్రివర్ణ పతాకం, మరో మూడింటిపై సైన్యం (ఆర్మీ, వైమానిక దళం మరియు నౌకాదళం) మూడు విభాగాల జెండాలు ఉంటాయి. ప్రేక్షకులపై పూల వర్షం కురిపించనున్నాయి. 

11.44: రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే (Republic Day 2022) పరేడ్  ముగిసింది
 

Follow Us:
Download App:
  • android
  • ios