Republic Day 2022: భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రిగాయి.  ముఖ్యంగా రాజ్‌ప‌థ్‌ లో కొన‌సాగిన రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంది. అలాగే, భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అట్టారీ-వాఘా సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), పాకిస్థాన్ ఆర్మీ మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

Republic Day 2022: భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రిగాయి.ఈ క్ర‌మంలోనే భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అట్టారీ-వాఘా సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), పాకిస్థాన్ సైన్యం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుకున్నాయి. నిత్యం స‌రిహ‌ద్దులో ప‌హారాకాస్తూ.. కాల్పులు జ‌రుపుకునే ప‌రిస్థితులు నెల‌కొన్న ప‌రిస్థితులు.. అయితే, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా అట్టారీ-వాఘా సరిహద్దు జాయింట్ చెక్‌పోస్టు (జేసీపీ) వద్ద బీఎస్‌ఎఫ్, పాకిస్థాన్ సైన్యం మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైన్యాలు మిఠాయిలు పంచుకున్నాయి. గతేడాది దీపావళి సందర్భంగా కూడా అట్టారీ-వాఘా సరిహద్దులో భారత సైన్యం, పాకిస్థాన్‌ సైన్యం మిఠాయిలు పంచుకున్నాయి. కాగా, భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు.రాజ్‌ప‌థ్ లో కొన‌సాగుతున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంది. భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.. రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగాయి. వివిధ రాష్ట్రాల‌తో పాటు వివిధ కేంద్ర శాఖ‌లు కూడా త‌మ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించాయి. అత్యంత వైభ‌వంగా రిపబ్లిక్ డే (Republic Day 2022)ప‌రేడ్‌లో శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

Scroll to load tweet…

రాజ్‌ప‌థ్‌లో ఇవాళ శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న అకట్టుకుంది. వివిధ రాష్ట్రాల‌తో పాటు వివిధ కేంద్ర శాఖ‌లు కూడా త‌మ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించాయి. అత్యంత వైభ‌వంగా రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆధాత్మిక గురువు శ్రీ అరబిందో 150వ జ‌యంతి సంద‌ర్భంగా.. కేంద్ర సాంస్కృతిక శాఖ రాజ్‌ప‌థ్‌పై శ‌క‌టాన్ని ప్ర‌ద‌ర్శించింది. భార‌త స్వాతంత్య్ర సంగ్రామ స‌మ‌యంలో.. శ్రీఅర‌బిందో త‌న ఆధ్యాత్మిక బోధ‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యాన్ని క‌లిగించారు. ప్ర‌వ‌క్త‌గా, దార్శ‌నిక‌నేత‌గా అర‌బిందోను కీర్తించారు. రిప‌బ్లిక్ డే 2022 ప‌రేడ్ లో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ 'భారత వైమానిక దళం భవిష్యత్తు కోసం వినూత్నంగా ముందుకు సాగుతూ.. అనేక మార్పులు తీసుకుంటున్న‌ద‌నే' అనే థీమ్‌ను ప్రదర్శిచింది. 

రిప‌బ్లిక్ డే నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ (Republic Day 2022) శుభాకాంక్ష‌లు తెలిపారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాధారణంగా జనవరి 24 నుండి ప్రారంభమవుతాయి, అయితే, ఈ సంవత్సరం నుండి అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ (netaji subhas chandra bose) జయంతిని పుర‌ష్క‌రించుకుని జనవరి 23 నుండి గ‌ణ‌తంత్ర వేడుక‌లు (Republic Day) నిర్వ‌హిస్తోంది ప్ర‌భుత్వం.

Scroll to load tweet…