ఇంటర్ పోల్ రెడ్ నోటీసుల నుంచి మెహుల్ చోక్సీ పేరు తొలగింపు.. కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పేరును ఇంటర్ పోల్ తన రెడ్ నోటీసు లిస్ట్ నుంచి తొలగించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,356.84 కోట్ల కుంభకోణాకి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు విదేశాల్లో తలదాచుకుంటున్నాడు.

ఇంటర్ పోల్ రెడ్ నోటీసు డేటాబేస్ నుంచి వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తొలగించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈడీ-సీబీఐ ప్రతిపక్ష నేతలను వెంబడిస్తోందని, అయితే పారిపోయిన వారికి ఉపశమనం కలుగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నినాదం 'నా ఖానే దూంగా' మరో జుమ్లా (వాక్చాతుర్యం)గా మారిందని ఖర్గే ఆరోపించారు.
రాజకీయ కోణంలోనే విచారణ, నా ఫోన్లు ఇస్తున్నా: ఈడీకి కవిత లేఖ
‘‘ప్రతిపక్ష నేతలకు ఈడీ-సీబీఐ. కానీ మోడీజీ మెహుల్‌భాయ్‌కు ఇంటర్‌పోల్ నుండి ఉపశమనం లభించింది. అతను తన ప్రియమైన స్నేహితుడి కోసం పార్లమెంటును స్తంభింపజేస్తే, ఐదేళ్ల కిందట పరారైన పాత స్నేహితుడికి సహాయం ఎలా తిరస్కరించగలడు?’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.
కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ)కి రూ.11,356.84 కోట్ల రుణాన్ని మోసం చేసిన కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీని ఇంటర్‌పోల్ తన రెడ్ నోటీసు జాబితా నుండి తొలగించింది. చోక్సీని డిసెంబర్ 2018లో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జాబితాలో చేర్చింది. కాగా.. ఆయనను ఆ జాబితా నుంచి తొలగించడంపై భారత ప్రభుత్వ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చోక్సీ బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పార్లమెంట్ మొదటి అంతస్తులో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు.. అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్
మరోవైపు మెహుల్ చోక్సీపై ఇంటర్ పోల్ నోటీసును రద్దు చేయడం వల్ల కేసుపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఇది ఇప్పటికే చివరి దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. చోక్సీని అరెస్టు చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ‘‘మెహుల్ చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) రద్దు చేయడం వల్ల ఇప్పటికే తుది దశలో ఉన్న కేసుపై ప్రభావం పడదు. ఒక ఒప్పందం అమల్లో ఉంది. చోక్సీని అరెస్టు చేసిన మరుక్షణమే తగిన ప్రక్రియను అనుసరిస్తాం’’ అని పేర్కొన్నారు. చోక్సీ ప్రస్తుతం కరేబియన్ ద్వీప దేశంలో ఉన్నాడు. విచారణను ఎదుర్కొనేందుకు అతనిని అప్పగించాలని భారత అధికారులు ఆంటిగ్వాన్ అధికారులను కోరారు.