జియో ఆఫర్... వినియోగదారులందరికీ 8జీబీ డేటా ఉచితం

First Published 26, May 2018, 3:28 PM IST
reliance jio offering 8gb free data to customers
Highlights

జియో కష్టమర్స్ అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. తన కష్టమర్లకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే పలు రకాల ఆఫర్లు, అతి తక్కువ ధరకే డేటా ప్లాన్లను ప్రవేశపెట్టి.. ఇతర టెలికాం సంస్థలకు
దడ పుట్టించింది జియో. కాగా.. తాజాగా మరో ఆఫర్ తీసుకువచ్చింది. 

రిలయన్స్ జియో గత నెలలో తన కస్టమర్లందరికీ 8 జీబీ డేటాను ఉచితంగా ఇచ్చింది గుర్తుంది కదా. రోజుకు 2 జీబీ డేటా చొప్పున 4 రోజుల వాలిడిటీతో ఈ డేటాను ఉపయోగించుకునేందుకు 
వీలు కల్పించింది. అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా మరో 8 జీబీ డేటాను తన కస్టమర్లందరికీ జియో ఉచితంగా ఇస్తున్నది. 

ఈ డేటా ఇప్పటికే కస్టమర్ల అకౌంట్‌లో యాడ్ అయిపోయి ఉంటుంది. కనుక దాన్ని నేరుగా వాడుకోవచ్చు. అందుకు ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన పనిలేదు. అదేవిధంగా ఆ డేటాను మై జియో 
యాప్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు కూడా. ఐపీఎల్ సీజన్ ముగుస్తున్న సందర్భంగా జియో ఈ డేటాను క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ కింద అందిస్తున్నది.

loader