రిలయన్స్ బిగ్ టీవీ సూపర్ ఆఫర్.. ఉచితంగా సెటాప్ బాక్స్

First Published 9, Jun 2018, 2:34 PM IST
Reliance Big TV's New Offer: Book 'Free' Set Top Boxes By Paying Rs. 500 At These Post Offices
Highlights

సంవత్సరం పాటు ఛానల్స్ కూడా ఫ్రీ

రిలయన్స్ బిగ్ టీవీ మరోసారి సూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఉచితంగా సెటాప్ బ్యాక్సులను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాకపోతే ముందుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వాటిని కంపెనీ క్యాష్ బ్యాక్ చేస్తుంది. రూ.500 చెల్లించిన వారికి   తమ కొత్త హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెటాప్‌ బాక్స్‌లను ఉచితంగా పోస్టు ఆఫీసుల వద్ద కంపెనీ అందజేస్తుంది.

 50 వేల పోస్టు ఆఫీసులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని ఈ సర్వీసులను అందజేస్తున్నామని రిలయన్స్‌ బిగ్‌ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్తాన్‌, పంజాబ్‌, ఉత్తరఖాండ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిం ప్రాంతాల పోస్టు ఆఫీసుల్లో  ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 

ఈ ఆఫర్‌ కింద ఏడాది పాటు ఉచితంగా ఛానల్స్‌ను ఆఫర్‌ చేయనుంది. దీనిలో హెచ్‌డీ ఛానల్స్‌ కూడా ఉన్నాయి. 500 ఎఫ్‌టీఏ(ఫ్రీ టూ ఎయిర్‌) ఛానల్స్‌ను ఎలాంటి ఖర్చు  లేకుండా ఐదేళ్ల పాటు అందించనుంది. జూన్‌ 15 నుంచి ఈ సెటాప్‌ బాక్స్‌లను కంపెనీ డెలివరీ చేయనుంది. ముందు బుక్‌ చేసుకున్న కస్టమర్లు జూలై 30 లోపల ఈ సెటాప్‌ బాక్స్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంది. పోస్టు ఆఫీసుల్లో వీటి బుకింగ్స్‌ జూన్‌ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.  

తాము ఆఫర్‌ చేసే హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెటాప్‌ బాక్స్‌లు షెడ్యూల్డ్‌ రికార్డింగ్‌, యూఎస్‌బీ పోర్ట్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌, ఏకకాలంలో రికార్డు చేయడం, వీక్షించడం వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. పోస్టు ఆఫీసుల వద్ద బుక్‌ చేసుకునేటప్పుడు రూ.500 కట్టిన అనంతరం, వాటిని ఇంటి వద్ద డెలివరీ చేసిన తర్వాత మిగిలిన మొత్తం రూ.1500 ను చెల్లించాలి. ఆ అనంతరం ఈ మొత్తం అంతా కస్టమర్లకు రీఫండ్‌ అవుతుంది. లోయల్టీ బోనస్‌లుగా రీఛార్జ్‌ల రూపంలో తిరిగి కస్టమర్లు పొందొచ్చు. బుక్‌ చేసుకున్న 30 నుంచి 45 రోజుల్లో కంపెనీ వీటిని వినియోగదారులకు డెలివరీ చేయనుంది.

loader