హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే, మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగిస్తే కాశ్మీర్ లోని ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదని మహారాష్ట్రలోని శివసేన పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. కాశ్మీర్ లో అస్థిర వాతావరణాన్ని తొలగించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.  

ఆర్టికల్ 370ని రద్దు చేసినా కాశ్మీర్ సమస్య ఇంకా ప‌రిష్కారం కావ‌డం లేద‌ని, కాశ్మీర్‌లో శాంతి నెల‌కొన‌లేదని కేంద్ర ప్రభుత్వంపై శివసేన నేత, రాజ్య‌స‌భ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్లు, కాశ్మీర్ ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయన అన్నారు. హనుమాన్ చాలీసా చదవడం, లౌడ్‌స్పీకర్లు ఆఫ్ చేయడం వల్ల కాశ్మీర్ సమస్య తొలిగిపోద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 

Sharad Pawar: పాకిస్తానీ పౌరులు భార‌త్ కు శ‌త్రువులు కాదు.. : శ‌ర‌త్ ప‌వ‌ర్

ఇటీవల జ‌రిగిన కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యపై సంజ‌య్ రౌత్ స్పందించారు. గత ఏడేళ్లలో కశ్మీర్ లోయకు తిరిగి వచ్చిన కశ్మీరీ పండిట్ల సంఖ్య గురించి తనకు తెలియదని అన్నారు. భట్ హత్యపై తీవ్రంగా ఆలోచించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరిన రౌత్, పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపాల్సిన అవసరం లేదని, కాశ్మీరీ పండిట్ల కోసం ఏమి చేయవచ్చో చూడాలని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న ఈ అస్థిర వాతావరణాన్ని అంతమొందించేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాల‌ని సూచించారు. 

BJP MLA Reaction on Hindu Rashtra: ఇత‌ర మ‌తాల ప్ర‌మేయం లేనిదే హిందూ రాష్ట్రం : బీజేపీ ఎమ్మెల్యే

‘‘ కశ్మీరీ పండిట్లను స్వస్థలాలకు రావడం, వారికి భద్రత కల్పించడం బీజేపీ ప్రధాన ఎజెండా. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కాశ్మీర్ పండిట్ల గురించి చాలా భావోద్వేగానికి గురయ్యారు. కాశ్మీరీ పండిట్ల స్వస్థలాలకు తిరిగి వస్తారనే చర్చ జరిగింది. కానీ ఎంత మంది ప్రజలు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంకా తెలియదు ? కాశ్మీరీ పండిట్లుగా ఉన్న వారిని కూడా సరిగా జీవించడానికి అనుమతించడం లేదు ’’ అని ఆయ‌న అన్నారు. 

Scroll to load tweet…

జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో కాశ్మీర్ పండిత్ అయిన రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఆయ‌న చ‌దూరా ప్రాంతంలోని త‌హసీల్ ఆఫీసులో క్ల‌ర్క్ గా ప‌ని చేస్తున్నారు. అత‌డిపై కాల్ప‌లు జ‌రిగిన వెంటనే స్థానికులు గ‌మ‌నించి హాస్పిటల్ కు త‌ర‌లించారు. అయితే ఆయ‌న చికిత్స పొందుతున్న స‌మ‌యంలోనే ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు. కాగా రాహుల్ భట్ అంత్యక్రియలు ఈ రోజు బంతలాబ్లో జరిగాయి. అతని హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. లోయలో నివసిస్తున్న కాశ్మీరీ హిందువులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన ఉగ్రవాదులు పిస్తోళ్లను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘ‌ట‌న దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.