Asianet News TeluguAsianet News Telugu

చెడ్డీ, టవల్ తో కాలేజీకి.. ఓ నిజ జీవిత మోగ్లీ ఇతడు.. ఇంతకీ ఎక్కడంటే...

మధ్యప్రదేశ్ లో ఓ కాలేజీ కుర్రాడికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. కేవలం డ్రాయర్, టవల్ తో కాలేజీకి వస్తున్న ఈ యువకుడిని అందరూ రియల్ లైఫ్ మోగ్లీ అంటున్నారు. 

Real Life Mowgli in Madhya Pradesh, college boy refuses to wear clothes
Author
First Published Oct 20, 2022, 1:22 PM IST

మధ్యప్రదేశ్ : నేటి రోజుల్లో కాలేజీకి  వెళ్లే కుర్రాడంటే ఎన్నో అవసరాలుంటాయి. చేతిలో స్మార్ట్ ఫోన్, బ్రాండెడ్ ప్యాంట్, షర్ట్ లు.. మినిమం బండి..  ఇవన్నీ కామన్. బండి లేకపోయినా కనీసం బట్టలైనా టిప్ టాప్ గా ఉండాల్సిందే. కానీ, ఆ అబ్బాయికి మాత్రం ఇవేమీ అక్కర్లేదు. ఒక అండర్ వేర్, టవల్ ఉంటే చాలు.. ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజం.  మధ్యప్రదేశ్లోని బర్వానీకి చెందిన ఓ యువకుడి రియల్ స్టోరీ ఇది.

చిన్నప్పుడు చూసిన  జంగిల్ బుక్ సినిమాలోని మోగ్లీని తలపిస్తున్న ఈ విద్యార్థి పేరు కన్నయ్య. అప్పట్లో మధ్యప్రదేశ్ అడవుల్లో పెరిగిన మోగ్లీ అనే ఈ బాలుడి కథ దాదాపు అందరికీ సుపరిచితమే. అడవుల్లో దొరికిన ఈ చిన్నారిపై ప్రముఖ నవలా రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ ‘జంగిల్ బుక్’ అనే పుస్తకం రాశారు. మధ్యప్రదేశ్లోని బర్వానీకి చెందిన పిచోరి గ్రామానికి చెందిన కన్నయ్య అవాసీకి కూడా అచ్చం మోగ్లీ మాదిరిగా బట్టలు ధరించడం అస్సలు ఇష్టం లేదట.  

దళిత యువకుల గుండు గీయించి, మెడ చెప్పులదండతో వేసి ఊరేగింపు...రాజీకి పిలిచి గ్రామపెద్దల దారుణం..

అందుకే స్కూల్ యూనిఫాం వేసుకోకుండా.. ఓ చెడ్డీ, టవల్ మాత్రమే ధరించి రోజు పాఠశాలకు వెళ్తూ ఉండేవాడు.  ఈ విధంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాలేజీ చదువులకు వెళ్లాలనుకున్నప్పుడు.. బట్టలు వేసుకోవాల్సిందేనని కాలేజీ యాజమాన్యం హుకూం జారీ చేసింది. దీంతో ఆ యువకుడు చేసేదేమీ లేక చదువు మానేయాలనుకున్నాడు. చివరికి కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాతే కాలేజీలో ప్రవేశం దొరికింది.  ప్రస్తుతం కన్నయ్య బిఎ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 

కాలేజీకి తప్పనిసరిగా దుస్తులు ధరించి వెళ్ళవలసి వస్తుందేమోనని పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. అయితే, దీనికి అప్పటివరకు అతనికి చదువు చెప్పి ఉపాధ్యాయులు అంగీకరించలేదు. వారు కూడా చాలా శ్రమపడి కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం కన్నయ్య బీఏ చదువుతున్నాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios