Asianet News TeluguAsianet News Telugu

దళిత యువకుల గుండు గీయించి, మెడ చెప్పులదండతో వేసి ఊరేగింపు...రాజీకి పిలిచి గ్రామపెద్దల దారుణం..

మధ్యప్రదేశ్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తితో ఘర్షణ విషయంలో ముగ్గురు దళిత యువకుల పట్ల పంచాయతీ పెద్దలు దారుణంగా వ్యవహరించారు. 
 

Youths tonsured, paraded with shoe garlands in madhyapradesh
Author
First Published Oct 20, 2022, 9:49 AM IST

భోపాల్ : మధ్యప్రదేశ్ ఖిండ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. శక్యా కమ్యూనిటీకి (ఎస్టీ)చెందిన ఇద్దరు యువకులకు గుండు గీయించారు గ్రామ పంచాయితీ పెద్దలు. అనంతరం వారి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. దబోహా గ్రామంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే..
రామ్ వీర్ శక్య, సంతోష్ శక్య, ధర్మేంద్ర శక్య అనే ముగ్గురు దబోహ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం వీరు గ్రామంలో దిలీప్ శర్మతో గొడవపడ్డారు. ఘర్ణణలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తరువాత ముగ్గురూ గ్రామం నుంచ పరారయ్యారు. నెలన్నర తరువాత శక్యా కమ్యూనిటీకి చెందిన హరిరామ్ ఈ ముగ్గురి తరఫున దిలీప్ తో రాజీ కుదిర్చేందుకు వెళ్లాడు.

23న తుపానుగా మారనున్న వాయుగుండం.. తీరం దాటేదెక్కడ?...

ఈ వ్యవహారం మీద పంచాయతీ పెద్దలు చర్చించారు. ముగ్గురు కలిసి రూ.1.5లక్షలు దిలీప్ వైద్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని సర్పంచ్ మురళీలాల్ ఆదేశించారు. అంతేకాదు ముగ్గురికీ గుండు గీసి, చెప్పులదండతో ఊరేగించాలని తీర్మానించారు. ఆ తరువాత దీన్ని అమలు చేశారు. 

విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. దిలీప్ శర్మ, అతని తండ్రిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాధిత యువకులను ఆస్పత్రికి తరలించారు. వారి ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios