Asianet News TeluguAsianet News Telugu

రియల్ హీరో సోనూసూద్ కు ముంబై మున్సిపాలిటీ మరోసారి నోటీసులు...ఎందుకంటే...

గతంలో సోను సూద్ భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. ‘మీ భవనంలోని ఒకటి నుంచి ఆరో అంతస్తులో మీరు బస/బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు మీరు లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్ ప్రకారం ఆ భవనం నివాస అవసరాలను ఉపయోగిస్తామని మీరు పేర్కొన్నారు.  పునరుద్ధరణకు అవసరమైన పని పురోగతిలో ఉందని మీరు చెప్పారు...' అని బీఎంసీ నోటీసులు పేర్కొంది.

Real Hero Sonu Sood gets another BMC notice over illegal hotel
Author
Hyderabad, First Published Dec 6, 2021, 11:34 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై :  ప్రముఖ సినీ నటుడు Sonu Soodకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మరో నోటీసు జారీ చేసింది. సోనూసూద్‌ తన ఆరు అంతస్తుల నివాస భవనాన్ని hotel గా మార్చారు అని.. దాన్ని తిరిగి నివాస భవనంగా పునరుద్ధరించాలని BMC జారీ చేసిన noticeలో కోరింది.  

నవంబర్ 15న ఈ నోటీసు జారీ చేశారు.  దీంట్లో నివాస స్థలాన్ని హోటల్గా మార్చారని ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలో సోనూసూద్ ను Bombay High Court విచారించింది. దీంతో సోనుసూద్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. Unauthorized hotelను మార్చి తిరిగి నివాస ప్రాంగణంగా పునరుద్ధరించడానికి అతను  అంగీకరించారు. 

గతంలో సోను సూద్ భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. ‘మీ భవనంలోని ఒకటి నుంచి ఆరో అంతస్తులో మీరు బస/బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు మీరు లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్ ప్రకారం ఆ భవనం నివాస అవసరాలను ఉపయోగిస్తామని మీరు పేర్కొన్నారు.  పునరుద్ధరణకు అవసరమైన పని పురోగతిలో ఉందని మీరు చెప్పారు...' అని బీఎంసీ నోటీసులు పేర్కొంది.

అక్టోబర్ 20న స్థలాన్ని పరిశీలించగా ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇంకా పనిని పునరుద్ధరించలేదని గమనించామని బీఎంసీ నోటీసులో తెలిపింది. హోటల్ ను నివాస భవనం గా మార్చాలని బీఎంసీ నోటీసులో సోనూసూద్ ను కోరింది.
                                                                                                                               ఇదిలా ఉండగా... సెప్టెంబర్ లో సోనూసూద్ పై ఐటీ దాడులు జరగడం మీద స్పందించారు. కరోనా కాలంలో నటుడు సోనూసూద్‌ వెలకట్టలేనంత సేవ కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. సోనూ సూద్‌ సేవకి ఎంతో మంది దాతలు ఆయనకు స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇచ్చారు. అయితే వాటిని క్రమంగా ఖర్చు పెట్టేందుకు ప్లాన్‌ చేశారట సోనూసూద్‌. 

అలాంటి వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు.. సోనూసూద్‌కు మద్దతుగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

కానీ ఇంతలో ఐటీ దాడులు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే, రియల్‌ హీరోపై ఐటీ దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయనకు సంబంధించిన అన్ని ఆఫీసులు, ఫౌండేషన్‌పై కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో రూ. 20కోట్లకుపైగా ట్యాక్స్ ఎగ్గొట్టారని ఐటీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడులపై సర్వత్రా విమర్శలొచ్చాయి. సోనూసూద్‌కి అభిమానులు, నెటిజన్లు మద్దతుగా నిలిచారు. 

ఈ నేపథ్యంలో తాజాగా సోనూసూద్‌ సెప్టెంబర్ 20న స్పందించారు. ఐటీ దాడుల అనంతరం ఆయన తొలిసారి ట్విట్టర్‌ ద్వారా దీనిపై పోస్ట్ పెట్టాడు. ఈసందర్భంగా ఐటీ అధికారులపై సెటైర్లు వేశారు. నాలుగు రోజులు అతిథులతో గడిపానని ఐటీ అధికారులను ఉద్దేశించి అన్నారు. ప్రతి భారతీయుడి ప్రార్థనలు ప్రభావం చూపుతాయని, కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం సాగుతుందని అన్నారు. ప్రతి పొదుపు చేసే ప్రతీ రూపాయి పేదల విలువైన జీవితాలను కాపాడటానికే అని తెలిపారు. 

`భారత ప్రజలకు సేవ చేయాలని నాకు నేను ప్రతిజ్ఙ చేసుకున్నా. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదల విలువైన జీవితాల కోసం పొదుపు చేసిందే. అంతేకాకుండా మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. గత నాలుగు రోజులుగా నేను నా అతిథుల (ఐటీ అధికారుల)తో బిజీగా ఉన్నాను. అందుకే మీ సేవలో ఉండలేకపోయా. నేను మళ్లీ తిరిగొచ్చాను` అని ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు సోనూసూద్‌.         

Follow Us:
Download App:
  • android
  • ios