Asianet News TeluguAsianet News Telugu

1930 నాటి ఆర్ధిక సంక్షోభం, 2021-22లో 7.4 జీడీపీ వృద్దిరేటు సాధిస్తాం: ఆర్బీఐ గవర్నర్

1930 నాటి ఆర్ధిక సంక్షోభాన్ని ఇప్పుడు చూస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్  అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం నెలకొందన్నారు. 2021-22 లో 7.4 జీడీపీ వృద్దిరేటు ఉంటుందని అంచనా వేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 
 

RBI quotes IMF on growth, says India to grow at 7.4% in 2021-22
Author
New Delhi, First Published Apr 17, 2020, 10:22 AM IST


న్యూఢిల్లీ: 1930 నాటి ఆర్ధిక సంక్షోభాన్ని ఇప్పుడు చూస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్  అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం నెలకొందన్నారు. 2021-22 లో 7.4 జీడీపీ వృద్దిరేటు ఉంటుందని అంచనా వేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 

శుక్రవారం నాడు ఆర్బీఐ గవర్నర్ శక్తిదాస్ కాంత్ ముంబైలో మీడియాతో మాట్లాడారు.ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. 

జీ20 దేశాలతో  పోల్చుకొంటే భారత్ జీడీపీనే అధికంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.లాక్ డౌన్ తర్వాత 1.20 లక్షల కోట్లు విడుదల చేశామని ఆయన గుర్తు చేశారు.కష్టాల్లో కూడ 1.9 శాతం వృద్ధిరేటు సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.జీడీపీలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరు చేస్తామన్నారు.  

ఆర్ధిక వ్యవస్థను కరోనా వైరస్ తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. వైరస్ తీవ్రత ఉన్నా కూడ ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. క్వారంటైన్ లో ఉండి కూడ సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స  అందిస్తున్న వైద్యులను ఆయన అభినందించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. బ్యాంకులకు నిధుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. దేశంలోని  91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని శక్తికాంత్ దాస్ చెప్పారు. .దేశ వ్యాప్తంగా 25 నుండి 30 శాతం పవర్ డిమాండ్ తగ్గిందన్నారు.. .నాలుగు మాసాల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తులు ఉన్నాయన్నారు. ఆటోమొబైల్ రంగం తీవ్ర నష్టాల్లో ఉందన్నారు.

also read:కరోనా దెబ్బ: 4 నుండి 3.75 శాతానికి రెపోరేటు తగ్గింపు, 21 రోజుల్లో రెండో సారి

రాష్ట్రాలకు అదనంగా 60 శాతం నిధులు మంజూరు చేసినట్టుగా ఆయన చెప్పారు.ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అందుబాటులోకి రూ. 50వేల కోట్లు నిధులు అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలిపారు. 

జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ. 10 వేల కోట్లు,  నాబార్దుకు రూ. 25 వేల కోట్లు,ఎస్ఐడీబీఐకి రూ. 15వేల కోట్లు, నేషనల్ హౌసింగ్ కార్పోరేషన్ కు రూ. 10 వేల కోట్లు కేటాయించినట్టుగా ఆయన తెలిపారు.

చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను  ఆదుకొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొన్నామన్నారు.  బాండ్ల ద్వారా రాష్ట్రాలు 65 శాతం నిధులను సమీకరించుకొనే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios