న్యూఢిల్లీ: రివర్స్ రెపో రేటును 4 నుండి 3.75 శాతానికి తగ్గిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.ఈ ఏడాది మార్చి 27వ తేదీన కూడ  రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే.

శుక్రవారంనాడు ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 27న  రెపో రేటును 4.4 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. బేసిక్ పాయింట్స్ ను 75కు తగ్గించింది. 

మానిటరీ పాలసీ కమిటి మార్చి 24, 26, 27 తేదీల్లో సమావేశం నిర్వహించింది. 4:2 మెజారిటీతో రెపోరేటును తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్  అప్పట్లో తెలిపారు.

also read:1930 నాటి ఆర్ధిక సంక్షోభం, 2021-22లో 7.4 జీడీపీ వృద్దిరేటు సాధిస్తాం: ఆర్బీఐ గవర్నర్

మార్చి 27వ తేదీకి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. దీన్ని ప్రస్తుతం 4.40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నారు.2019 అక్టోబర్ 4వ తేదీన ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లను తగ్గించి రెపో రేటును 5.15 శాతానికి తగ్గించింది. పండుగ సమయాల్లో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చేందుకు ఆ సమయంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకొంది. 

నిధుల కొరత లేకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కోరారు. టర్మ్ లోన్ల చెల్లింపుపై మూడు మాసాల పాటు తాత్కాలిక నిషేధాన్ని అనుమతించేందుకు అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుమతి ఉందని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.

also read: కరోనా ఎఫెక్ట్: రెపో రేటు 4.40%తగ్గింపు, 3 నెలలు ఈఎంఐలపై మారటోరియం...

తాజాగా ఇవాళ  రివర్స్ రెపోరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది ఆర్బీఐ .4 శాతం నుండి 3.75 శాతానికి  రివర్స్ రెపో రేటును తగ్గిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. 21 రోజుల వ్యవధిలో రెండోసారి రెపోరేటును తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.