మరోసారి వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ: 4.4శాతం నుండి 4 శాతానికి తగ్గింపు

మరోసారి వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.
 

RBI governor Shaktikanta Das announces 40 bps cut in repo rate

ముంబై:మరోసారి వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారంనాడు ఉదయం ముంబైలో మీడియాతో మాట్లాడారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్  మీడియా ముందుకు వచ్చారు. 

వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. రేపో రేటును 40 బీపీఎస్ పాయింట్ల నుండి 4 శాతానికి తగ్గించాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. రెపో రేటు 4.4 శాతం నుండి 4 శాతానికి తగ్గించినట్టుగా ఆయన వివరించారు.  రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించినట్టుగా చెప్పారు.

also read:కరోనా దెబ్బ: 4 నుండి 3.75 శాతానికి రివర్స్ రెపోరేటు తగ్గింపు

లాక్ డౌన్ సమయంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన మీడియాతో మాట్లాడారు. 1930 నాటి ఆర్ధిక సంక్షోభం తరహా సంక్షోభాన్ని చవిచూస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.

మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. 13 నుండి 32 శాతం ప్రపంచ వాణిజ్యం తగ్గినట్టుగా డబ్ల్యుటీఓ ప్రకటించిన విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడికుల్లో ఉన్నట్టుగా ఆయన చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios