Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ఐటీ శాఖ మంత్రికి ట్విట్టర్ షాక్: గంట పాటు అకౌంట్ నిలిపివేత

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ట్విట్టర్ షాకిచ్చింది.  గంట పాటు రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ను నిలిపివేసింది.  గంట తర్వాత రవిశంకర్ అకౌంట్ ను తిరిగి ఆయనకు యాక్సెస్ చేసుకొనే అవకాశం లభించింది.

Ravi Shankar Prasad's Twitter handle blocked, restored an hour later lns
Author
New Delhi, First Published Jun 25, 2021, 5:19 PM IST

న్యూఢిల్లీ:కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ట్విట్టర్ షాకిచ్చింది.  గంట పాటు రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ను నిలిపివేసింది.  గంట తర్వాత రవిశంకర్ అకౌంట్ ను తిరిగి ఆయనకు యాక్సెస్ చేసుకొనే అవకాశం లభించింది. కేంద్రానికి, ట్విట్టర్ కి మధ్య కొంత కాలంగా విబేధాలు చోటు చేసుకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాము తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ ను పాటించకపోవడంలో కేంద్రం ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది.  ఈ తరుణంలో  కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విట్టర్ ఖాతాను గంట పాటు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.

also read:శశిథరూర్ కమిటీ ముందుకు ట్విట్టర్ ప్రతినిధులు.. ఏం చెప్పబోతోందో..?

ఈ విషయమై ట్విట్టర్ వేదికగానే  రవిశంకర్ ప్రసాద్  ఈ విషయాన్ని ప్రకటించారు.  టీవీ చర్చల నుండి తన క్లిప్‌లను పోస్టు చేయడం ద్వారా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారనే ఫిర్యాదులపై  ట్విట్టర్ మంత్రి ఖాతాను గంటపాటు  బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ఆయన తెలిపారు. ట్విట్టర్ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ రూల్స్ 4(8) ను పూర్తిగా ఉల్లంఘించాయని ఆయన  చెప్పారు. తన ఖాతాను బ్లాక్ చేసే ముందు కనీసం తనకు నోటీసు కూడ ఇవ్వలేదన్నారు.

రైతుల నిరసనలకు మద్దతుగా ట్వీట్లు తొలగించాలని చేసిన వినతిని ట్విట్టర్ పట్టించుకోలేదు. బీజేపీ నాయకులను కించపర్చేలా పెట్టిన పోస్టులను కూడ ట్విట్టర్ తొలగించని విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.తాను పోస్టు చేసిన టీవీ ఇంటర్వ్యూల వీడియోలపై  ఏ టీవీ చానెల్ గానీ, యాంకర్ కానీ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. కానీ ఫిర్యాదులు వచ్చినందువల్లే తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేసినట్టుగా ట్విట్టర్ చెబుతోందన్నారు. నూతన ఐటీ రూల్స్  విషయంలో  తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్ చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. నూతన ఐటీ నిబంధనలపై రాజీపడబోమని మంత్రి స్పష్టం చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios