కాసేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు ట్విట్టర్ ప్రతినిధులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆధ్వర్యంలో ఐటీ వ్యవహారాలపై ఈ కమిటీ ఏర్పాటైంది. ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఈ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు
కాసేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు ట్విట్టర్ ప్రతినిధులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆధ్వర్యంలో ఐటీ వ్యవహారాలపై ఈ కమిటీ ఏర్పాటైంది. ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఈ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జనవరిలో తొలిసారిగా ట్విట్టర్‌కు సమన్లు జారీ చేశారు. అయితే కొత్త ఐటీ నిబంధనలను ట్విట్టర్ నిరాకరించింది. కరోనా కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు సమయం కావాలని కేంద్రాన్ని కోరింది.
ఈ క్రమంలో ఫిబ్రవరిలో కొత్త నైతిక మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఇదే సమయంలో కేంద్రానికి, ట్విట్టర్‌కు మధ్య వార్ ముదిరింది. పౌరహక్కుల పరిరక్షణకు, మరి ముఖ్యంగా మహిళల హక్కులు, గౌరవం పరిరక్షణలో సామాజిక మాధ్యమం వేదిక దుర్వినియోగం కాకుండా ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించాలని శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read:ముదురుతున్న వార్: ట్విట్టర్ ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ట్విట్టర్‌పై తొలి కేసు నమోదైంది. జూన్ 5న ఘజియాబాద్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ట్విట్టర్‌పై కేసు నమోదు చేశారు. కొంతమంది జర్నలిస్ట్‌లు, కాంగ్రెస్ నాయకులపైనా కేసులు పెట్టారు. ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఢిల్లీ సరిహద్దుల్లో వున్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించారు.
