Asianet News TeluguAsianet News Telugu

రేషన్ స్కాం : బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్...

పశ్చిమబెంగాల్ అటవీశాఖామంత్రి జ్యోతిప్రియో మల్లిక్ ను ఈడీ రేషన్ స్కాంలో అరెస్ట్ చేసింది. 20 గంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. 

Ration Scam : Bengal Minister Jyotipriya Mallick Arrested - bsb
Author
First Published Oct 27, 2023, 11:59 AM IST | Last Updated Oct 27, 2023, 12:04 PM IST

పశ్చిమ బెంగాల్ :  రేషన్ పంపిణీ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్ అయ్యారు. ఆయన మీద రేషన్ స్కాం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ  పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ టీఎంసీ నేత జ్యోతిప్రియ మల్లిక్ అటవీశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 20 గంటలకు పైగా రేషన్ స్కామ్ లో ప్రశ్నించింది. అంతకుముందు ఆయన నివాసాల్లో తనిఖీలు కూడా నిర్వహించారు.  విచారణ తరువాత శుక్రవారం తెల్లవారుజామున జ్యోతిప్రియ మల్లిక్ ను అరెస్టు చేశారు.

ప్రస్తుతం బెంగాల్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిప్రియ మల్లిక్ అంతకు ముందు పౌరసరఫరాల మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో రేషన్ పంపిణీ విషయంలో కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటి మీద దృష్టి సారించిన ఈడీ అధికారులు ముందుగా కోల్కతాలోని మల్లిక్ కు చెందిన రెండు ఫ్లాట్లలో సోదాలు నిర్వహించారు. జ్యోతిప్రియ మల్లిక్ వ్యక్తిగత సహాయకుడి నివాసంలో కూడా తనిఖీలు చేశారు. ఇలా మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు నిర్వహించామని, వారిని ప్రశ్నించామని ఈడీ వెల్లడించింది.

Narayana Murthy : యువకులు వారానికి 70 గంటలు పని చేయాలి - ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈడి తనిఖీల నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఆరోగ్యం గనక క్షీణిస్తే దర్యాప్తు సంస్థలు. బిజెపిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు మమతా బెనర్జీ మాట్లాడుతూ…‘దర్యాప్తు సంస్థలు.. మానసికంగా మాత్రమే హింసిస్తారని…శారీరకంగా హింసించారని  మీరు అనుకుంటున్నారా? అందులో వాస్తవం ఉండదు.. మనల్ని ఆ సమయంలో లోపలికి అనుమతించరు. ఏం జరిగింది తెలియదు.ఈడి దాడుల వల్ల మంత్రికి ఏమైనా జరిగితే.. ఈడీ మీద, బిజెపి మీద కేసులు పెడతాం’  అంటూ వ్యాఖ్యానించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios