ఓ నగల షాపులో చోరీ జరిగింది. నెక్లెస్‌ను చోరీ చేసిన ఓ దొంగ ఓ చిట్టెలుక. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

న్యూఢిల్లీ: నగల షాపులో దొంగలు పడ్డారంటే ఎవరికైనా మనుషులే చోరీ చేసి ఉంటారని ఆలోచన ఉంటుంది. కానీ, ఈ వీడియో మన అభిప్రాయాలను పునరాలోచించేలా చేస్తున్నది. ఎందుకంటే ఈ వీడియోల నగల దొంగ అసలు మనిషే కాదు. ఓ చిట్టెలుక. ఔను.. ఆ నెక్లెస్‌ను ఎవరి కోసం తీసుకెళ్లుతున్నదో తెలియదు కానీ, దొంగిలించింది మాత్రం ఎలుకే. ఈ ఘటన మనకు సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

30 సెకండ్ల ఆ వీడియోను ఐపీఎస్ అధికారి రాజేశ్ హింగాంకర్ పోస్టు చేశారు. నగల షాపులోని ఓ ఎలుక దాని కలుగు(!) నుంచి బయటకు వచ్చింది. ఎలుక నివసిస్తున్న ఏరియా ప్రదర్శనకు ఉంచిన నగ బొమ్మకు సమీపంగానే ఉన్నది. అందులో నుంచి బయటకు వచ్చిన ఎలుక ఆ బొమ్మపై దూకింది. అనంతరం, దాని మెడ పై ప్రదర్శనకు ఉంచిన నెక్లెస్‌ను నోటితో కరుచుకుని పట్టుకుంది. మళ్లీ క్షణాల్లో దాని స్పాట్‌కు తీసుకెళ్లింది. ఇదంతా వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నది.

Scroll to load tweet…

Also Read: ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ఆటమ్ బాంబ్ తీసుకెళ్లు.. లోకం నీ కాళ్ల కిందికి వస్తుంది: పాకిస్తాన్ నేత (video)

ఈ వీడియోను పోస్టు చేసిన ఐపీఎస్ అధికారి ఓ సరదా క్యాప్షన్ కూడా జోడించారు. ఈ ఎలుక ఆ డైమండ్ నెక్లెస్‌ను ఎవరి కోసం తీసుకెళ్లి ఉంటుందబ్బా? అంటూ హిలేరియస్‌గా కామెంట్ పెట్టారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. అయితే, ఈ షాప్ ఎక్కడిదన్న వివరాలు మాత్రం తెలియరాలేవు.