సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాల పొడిగింపు ఆర్డినెన్సులు.. ఆ సమాచారం ఇవ్వడానికి కుదరదు !
Rashtrapati Bhavan: ఇటీవల కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్రపతి ఆర్డినెన్స్ నోట్ లు జారీ చేసిన వెంటనే ఈడీ చీఫ్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. అయితే, దీనికి సంధించిన ఆర్గినెన్స్ లు తీసుకురావడానికి ప్రేరేపించిన పరిస్థితులు, సంబంధిత విషయాలు వెల్లడించాలని ఆర్టీఐ ద్వారా కోరగా, ఆధికార యంత్రాంగం నిరాకరించింది.
Rashtrapati Bhavan:సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌ల పదవీకాలాన్ని పొడిగించే ఇటీవలి ఆర్డినెన్స్‌లను ప్రేరేపించిన సమాచారాన్ని వెల్లడించడానికి రాష్ట్రపతి భవన్ నిరాకరించింది. ఇటీవలే ఈ రెండు సంస్థల చీఫ్‌ల పదవీ కాలాన్ని రెండేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్రపతి గెజిట్ నోట్‌లు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలాన్ని పెంచడానికి ప్రేరేపించిన పరిస్థితులు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సహాచార హక్కు చట్టం కింద కోరుతూ.. ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సమాధానంగా సమాచార హక్కు చట్టం-2005లోని సెక్షన్ 8(1Xi) ప్రకారం.. దరఖాస్తుదారుడు కోరిన సంబంధిత సమాచారం ఆర్టీఐ చట్టం నుంచి మినహాయించబడిన క్యాబినెట్ నోట్‌ను కలిగి ఉన్నందున కోరిన సమాచారం అందించబడదు అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది.
Also Read: Omicron:ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. హెల్త్ కేర్ సిస్టమ్ ప్రమాదంలో పడొచ్చు: డబ్ల్యూహెచ్‌వో
కాగా, భరద్వాజ్ నవంబర్ 26న ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. ఆ తర్వాతి 12 రోజులకే రెండు ఆర్డినెన్సులు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్-2021, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సవరణ) ఆర్డినెన్స్-2021ల నోట్‌లను రాష్ట్రపతి జారీచేశారు. ఈ ఆర్డినెన్స్‌లు సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలాన్ని ఒకే సారి సంవత్సరం పాటు మొత్తం ఐదేండ్లకు మించకుండా పొడిగించేందుకు వీలు కల్పించాయి. భరద్వాజ్ తన ఆర్టీఐ దరఖాస్తులో ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 123(1) ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు జరుగుతున్నప్పుడు తప్ప, ఎప్పుడైనా తక్షణమే చర్య తీసుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయని భావించి.. దానికి అనుగుణంగా ఆర్డినెన్స్‌ను ప్రకటించవచ్చు. అయితే, దానికి దారి తీసిన పరిస్థితులు, అంశాల అన్ని రికార్డు కాపీలు, మెటీరియల్‌లోని సమాచారం, వాస్తవ పరిస్థితులపై రాష్ట్రపతి సంతృప్తి ఆధారపడి ఉటుందని’ పేర్కొన్నారు.
Also Read: Coronavirus: దేశంలో కరోనా కల్లోలం.. ముంబయిలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం కేసుల పెరుగుదల
కాబట్టి సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధిచిన ఆర్డినెన్స్‌లు తీసుకురావడానికి గల పరిస్థితులు, సంబంధిత వివరాలు అందించాలని భరద్వాజ్ సమాచార హక్కు చట్టం-2005 కింద కోరారు. అయితే, సంబంధిత వివరాలు వెల్లడించడానికి అధికార యాంత్రాంగం నిరాకరించింది. డిసెంబర్ 20న సీపీఐవో ఈ వివరాలు ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై భరద్వాజ్ మాట్లాడుతూ.. పై రెండు ఆర్డినెన్స్‌లు సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలాన్ని పొడిగించానికి తీసుకురాబడ్డాయి. వీటిని తీసుకువచ్చిన (నవంబర్ 14) మూడు రోజుల తర్వాత (నవంబర్ 17) త్వరలో పదవీ కాలం ముగియబోతున్న ఈడీ చీఫ్ మిశ్రా పదవీ కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఇటీవల మిశ్రాకు తదుపరి పొడిగింపు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇది ధిక్కరించిందని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి నిరాకరించిన తీరుపై తాము అప్పీలు కమిటీలో సవాలు చేస్తుమని భరద్వాజ్ వెల్లడించారు.
Also Read: FAIMA:నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ !