Asianet News TeluguAsianet News Telugu

చెల్లెలిపై అత్యాచారం.. ఫిర్యాదు చేశాడని అన్న హత్య !? ఉత్తరప్రదేశ్ లో దారుణం..

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి గురైన పదహారేళ్ల అమ్మాయి అన్న.. చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో అది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Rape victim's brother, 23, found hanging from tree in UttarPradesh
Author
Hyderabad, First Published Aug 23, 2022, 11:39 AM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో దారుణం ఘటన చోటు చేసుకుంది. రెండు వారాల క్రితం 16యేళ్ల బాలిక మీద ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ మేరకు వారి కుటుంబం ఫిర్యాదు చేయడంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో అత్యాచారానికి గురైన బాలిక సోదరుడు శనివారం గ్రామంలోని ఓ చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. శనివారం బులంద్‌షహర్ జిల్లాలోని అహర్ ప్రాంతంలోని ఒక గ్రామంలో చెట్టుకు వేలాడుతూ అతడి మృతదేహం కనిపించింది. 

ఈ మృతి అనుమానాస్పందంగా ఉండడంతో పోలీసులు ఔరంగాబాద్ తహర్‌పూర్ గ్రామపెద్దతో సహా ఆరుగురిపై హత్య కేసును నమోదు చేశారు. బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 20 రాత్రి, 23 ఏళ్ల ఆ యువకుడిని గ్రామ పెద్ద భోలు సింగ్, మరి కొంతమంది వ్యక్తులు పిలిచారు. అతని సోదరిపై అత్యాచారం కేసు గురించి మాట్లాడడానికి రమ్మంటున్నారని తీసుకువెళ్లారు. ఆ తరువాత అతడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభించింది. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

ఎనిమిదేళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం.. గొంతు కోసి, ముఖాన్ని ఛిద్రం చేసి.. ఓ కసాయి దారుణం..

"అతని శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి. ఇది హత్య అని స్పష్టంగా తెలుస్తుంది" అని తండ్రి ఆరోపించారు. అయితే, బాధితుడి శరీరంపై గాయాలకు సంబంధించి కుటుంబం చేస్తున్న ఆరోపణలు తప్పుడువి అని అహర్ ఎస్ హెచ్వో శైలేందర్ కుమార్ కొట్టివేశారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తున్నప్పటికీ హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ కుమార్ తెలిపారు.

ఈ విషయంపై ఎస్ఎస్పీ (బులంద్‌షహర్) శ్లోక్ కుమార్ మాట్లాడుతూ, "నిందితులందరినీ బుక్ చేసాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి ఫోరెన్సిక్ బృందాలను నియమించాం. ఈ విషయంలో మెడికో-లీగల్ బృందంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపారు. 

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios