ఢిల్లీలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, పక్కనే ఉన్న యమునా ఖాదర్‌లోని అటవీ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడైన కసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

న్యూఢిల్లీ : సెంట్రల్ ఢిల్లీలోని యమునా ఖాదర్ అటవీ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసిన కేసులో 36 ఏళ్ల కసాయిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి బాలిక గొంతు కోసి, ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాడని వారు తెలిపారు. నిందితుడు రిజ్వాన్ అలియాస్ బాద్షా బీహార్‌ నివాసి. పని కోసం 20 సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చాడు. తుర్క్‌మన్ గేట్ ప్రాంతంలో కసాయిగా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిస అయిన రిజ్వాన్ వీడ్ తాగడానికి యమునా ఖాదర్ వద్దకు వెళ్లేవాడని వారు తెలిపారు. 

ఈ క్రమంలో దర్యాగంజ్ లో ఉండే ఓ వ్యక్తి భార్యతో అతనికి సంబంధం ఏర్పడింది. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. ఆగష్టు 4-5 మధ్య రాత్రి, అతను తన భార్య, నలుగురు పిల్లలతో తన ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు మేలుకువ వచ్చి చూసేసరికి, తన కుమార్తెలలో ఒకరు కనిపించలేదు. దీంతో అంతటా వెతికాడు. ఆమె కోసం పొరుగు వారిని అడిగాడు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఆగస్టు 18న యమునా ఖాదర్ ప్రాంతంలో తప్పిపోయిన బాలిక మృతదేహం కనిపించింది. శరీరంపై పదునైన ఆయుధంలో గాయాలు చేసినట్టు కనిపించింది. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య), లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడం (పోక్సో) చట్టం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసును విచారించేందుకు 50 మంది పోలీసులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని, నిందితుడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున వేట ప్రారంభించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు.

ఘోరం.. ఆరేళ్లుగా మైనర్ పై తండ్రి అత్యాచారం.. న‌ర‌క‌యాత‌న భ‌రించ‌లేక బాలిక ఆత్మ‌హ‌త్య

సమీపంలోని అన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేసినా ఎలాంటి క్లూ లభించలేదన్నారు. యమునా ఖాదర్ ప్రాంతంలో, చుట్టుపక్కల నివసించే సుమారు 200 మంది వ్యక్తులను విచారించిన తరువాత.. నిందితుడి గురించి కొంత సమాచారం దొరికిందని ఆమె చెప్పారు. "వృత్తి రీత్యా కసాయిగా అయిన రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి బాధితురాలి ఇంటికి తరచుగా వెళ్లేవాడని, బాధితురాలితో టాఫీలు, బిస్కెట్లు ఇచ్చి స్నేహం చేసుకున్నాడని తెలిసింది. "సంఘటన జరిగిన రోజున, రిజ్వాన్ యమునా ఖాదర్‌కు వచ్చినట్లు వెల్లడైంది. దీంతో రిజ్వాన్‌ను వెతికి పట్టుకుని.. పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించాడు" ఆమె చెప్పింది.

యమునా ఖాదర్ ప్రాంతానికి వెడుతున్న సమయంలో బాధితురాలి తల్లి జుగ్జీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అ క్రమంలో మైనర్ బాలికతో స్నేహం చేశాడు.బాధితురాలు తనను, ఆమె తల్లితో సన్నిహితంగా ఉండడం చూసిందని, అందుకే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నానని రిజ్వాన్ వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. ఘటన జరిగిన రోజు కూడా ఆమె పక్కింటికి వెళ్లి వీడ్ తాగినట్లు రిజ్వాన్ తెలిపారు. ఆ తరువాత అక్కడినుంచి వెళ్లిపోకుండా అందరూ పడుకునే వరకు వేచి ఉన్నాడని, బాధిత కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక ఘాతుకానికి పాల్పడ్డాడని డీసీపి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ కుటుంబం గుడిసెలో పడుకుని ఘాడనిద్రలోకి వెళ్లేవరకు వేచి చూసిన నిందితుడు ఆ తరువాత మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పక్కనే ఉన్న యమునా ఖాదర్ అటవీ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత, ఆమె గొంతు కోసి, ముఖాన్ని ఛిద్రం చేశాడు.. అని చౌహాన్ చెప్పాడు. నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.