సిద్ధప్ప.. 2010లో కర్ణాటకలోని ఖానాపూర్ గ్రామంలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో దోషి. ఈ అఘాయిత్యానికి పాల్పడిన తరువాత అతను బాధితురాలి మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి, దానిని బెన్నిహల్లా నదిలో విసిరేశాడు.
న్యూఢిల్లీ : అత్యాచారం-హత్య కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. rape-and-murder casesలో నిందితులకు తక్కువ వయస్సు అనే ఒకే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం సరికాదని కోర్టు భావిస్తుందని తెలిపింది. గత 40 సంవత్సరాలలో నమోదైన ఇలాంటి 67 కేసులను విశ్లేషించిన తరువాత ఈ తీర్పును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టుపై విధంగా పేర్కొంది.
ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించబడి మరణశిక్ష విధించిన ఈరప్ప సిద్దప్ప అనే వ్యక్తి అప్పీల్‌పై అత్యున్నత న్యాయస్థానం కీలకమైన పరిశీలన చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు మార్చి 6, 2017న ధృవీకరించింది.
సిద్ధప్ప.. 2010లో కర్ణాటకలోని ఖానాపూర్ గ్రామంలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో దోషి. ఈ అఘాయిత్యానికి పాల్పడిన తరువాత అతను బాధితురాలి మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి, దానిని బెన్నిహల్లా నదిలో విసిరేశాడు.
అత్యాచారం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలకు సంబంధించి సిద్దప్పను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అతనికి మరణశిక్షను విధించకుండా వదిలేసింది. దీనికి కారణం నిందితుడి వయస్సుగా చూపించారు. ఆ సమయంలో అతను మైనర్ కావడంతో death penaltyని 30 సంవత్సరాల life imprisonmentగా మార్చారు.
"సెక్షన్ 302 కింద నేరం చేసిన అప్పీలుదారు నీసం ముప్పై సంవత్సరాల జైలు శిక్ష అనుభవించే వరకు ముందస్తు విడుదల/ఉపశమనానికి అర్హత ఉండదనే ఆదేశాలతో, సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది" అని జస్టిస్ ఖన్నా బెంచ్ రాసిన తీర్పులో పేర్కొంది. అంతేకాదు శిక్షాకాలం ఏకధాటిగా ఉండాలని.. మధ్యలో గ్యాప్ లు ఉండొద్దని ఆదేశించింది.
అత్యాచారం-హత్య కేసుల్లో గత 40 యేళ్లుగా మైనర్ అనే కారణంతో మరణశిక్షనుంచి మినహాయించబడిన 67 తీర్పులను సుప్రీంకోర్టు పరిశీలించింది. అలాగే ఉన్నతన్యాయస్థానం శత్రుఘ్న బాబన్ మెష్రామ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావించింది. వీటి ఆధారంగా అత్యాచారం-హత్య కేసుల్లో నిందితులు మైనర్లన్న కారణంగా మరణశిక్షకు మినహాయింపు నివ్వడం సరికాదని పేర్కొంది.
ఈ తీర్పులలో వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న నిందితులకు, IPC సెక్షన్లు 376 (అత్యాచారం), 302 (హత్య) కింద ఆరోపించబడిన నేరాలకు ట్రయల్ కోర్టు లేదా హైకోర్టు మరణశిక్ష విధించిందని ఉన్నత న్యాయస్థానం చెప్పుకొచ్చింది.
"ఈ 67 కేసులలో, ఈ కోర్టు 15 కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధించడాన్ని ధృవీకరించింది. ఈ 15 కేసులలోనూ మూడు కేసుల మీద వచ్చిన రివ్యూ పిటిషన్లను పరిశీలించిన కోర్టు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
“మిగిలిన 12 కేసులలో, రెండు కేసులలో..., ఈ కోర్టు మరణశిక్షను నిర్ధారించింది మరియు రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. నేరం జరిగిన తేదీ నాటికి, ప్రధాన నేరాలు సెక్షన్ 376, 302 IPC కింద నేరం రుజువు చేయబడిన నిందితులు 16 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న 67 కేసులలో 12 కేసులలో మరణశిక్ష నిర్ధారించబడింది, ”అని పేర్కొంది.
ఈ 67 కేసులలో, కనీసం 51 కేసులలో, బాధితులు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారని, మూడు కేసుల reviewలో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చినట్లు తెలిపింది.
“ఈ కోర్టు మరణశిక్ష విధించడానికి victim తక్కువ వయస్సును మాత్రమే తగినంత కారకంగా పరిగణించలేదని పై డేటా ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే, అన్ని లేదా దాదాపు అన్ని 67 కేసులు నిందితులకు మరణశిక్ష విధించడంతో ముగిసి ఉండేవి, ”అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
ఈ తీర్పు వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ చేయబడింది. ఇలాంటి నేరాలు హేయమైనవి, ఖండించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కాకపోతే "ఇది అత్యంత అరుదైనది కాదు, తద్వారా సమాజం నుండి అప్పీలుదారుని తొలగించాల్సిన అవసరం ఉంది."
ప్రతి రోజు పార్లమెంటుకు ట్రాక్టర్ మార్చ్ చేపడతాం.. రైతుల నిర్ణయం
నేరస్థుడు సమాజానికి నిరంతర ముప్పుగా హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నిరూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చూపించలేదని, జైలులో అతని ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని వివరించింది. "అప్పీలుదారు అసహ్యకరమైన నేరానికి పాల్పడ్డాడనడంలో సందేహం లేదు, దీని కోసం జీవిత ఖైదు అతని చర్యలకు తగిన శిక్షగా.. పశ్చాత్తాపానికి కారణమవుతుందని మేము విశ్వసిస్తున్నాం.
అతను బతికుండడం వల్ల సమాజానికి తీవ్ర నష్టం అని చూపించే ెలాంటి ఆధారాలు లేనప్పుడు, జీవితఖైదు అనేది సరైనదే అని మా అభిప్రాయం. అంతేకాదు అలాంటి ప్రమాదం ఏదైనా ఉంటే జీవిత ఖైదు అటువంటి ముప్పును కూడా దూరం చేస్తుంది. సంస్కరణ, పునరావాసం కల్పిస్తారని ఆశిస్తున్నాం. అందువలన జీవిత ఖైదు అనేది మార్చడం కుదరదు” అని బెంచ్ చెప్పింది.
