తమిళనాడులో దారుణం జరిగింది. పదిహేడేళ్ల బాలుడిపై పాశవికంగా అత్యాచారం చేసి అతని చావుకు కారణమయ్యాడో మానవ మృగం. 2019లో పుదుక్కోటై జిల్లా, కీర్నూర్ లో జరిగిన ఈ ఘటనలో నిందితుడికి మూడు మరణశిక్షలు వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెడితే.. గుజరాత్ కు చెందిన దినేష్ పాటిల్ (34) స్థానికంగా ఉన్న ఓ స్టోన్ క్రష్షింగ్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. దినేష్ ఇంటిపక్కనుండే 17యేళ్ల మానసిక బుద్ధిమాంధ్యం ఉన్న బాధితుడిని తన బండిమీద ఎక్కించుకుని నిర్జనప్రదేశానికి తీసుకు వెళ్లాడు. అక్కడ అతనిమీద పాశవికంగా లైంగిక దాడి చేశాడు.

ఆ తరువాత ప్రైవేట్ పార్ట్స్ లో చెట్లుకొమ్మలు దూర్చి అక్కడే వదిలేసి వెళ్లాడు. దీంతో బాలుడు తీవ్రం గాయాల పాలయ్యాడు. శరీరం లోపల విపరీతమైన రక్తస్రావంతో పడి ఉన్న అతన్ని పుదుక్కోటి ప్రభుత్వా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. 

చికిత్స తీసుకుంటూ బాలుడి పరిస్థితి విషమించడంతో ఘటన జరిగిన 18 రోజుల తర్వాత ఆర్గాన్ ఫెయిల్యూర్ తో చనిపోయాడు. అదేరోజు నిందితుడిని గుండా యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. గతేదాడి ఫిబ్రవరిలో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ కేసు మహిళా కోర్టులో విచారణలో ఉంది. 

నిందితుడి మీద పోస్కో చట్టం 5(k), 5(i) కింద కేసు నమోదు చేయబడింది. బుద్దిమాంద్యం ఉన్న పిల్లాడి పరిస్థితిని అలుసుగా తీసుకుని లైంగిక దాడికి పాల్పడడం అనే నేరం కింద, కిడ్నాప్, మర్డర్ లాంటి సెక్షన్ లు మోపబడ్డాయి. 2019లో జరిగిన ఈ కేసులో గురువారం జిల్లా జడ్జ్ తీర్పునిచ్చారు. 

డిస్ట్రిక్ జడ్జ్ ఆర్ సత్య ఈ కేసులో తీర్పును వినిపిస్తూ బుద్దిమాంద్యం ఉన్న బాలుడిపై అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితుడికి మూడు మరణశిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతోపాటు పోస్కో చట్టం కింద నిందితుడు దినేష్ పాటిల్ కు 30వేల జరిమానా విధించారు. 

మృతుడి కుటుంబానికి 6 లక్షల నష్ట  పరిహారాన్ని ప్రకటించారు. గతేడాది ఇలాంటి కేసులో ఏడేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన 25 యేళ్ల యువకుడికి మూడు మరణశిక్షలు విధించారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి కూడా మూడు లక్షల నష్టపరిహారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆరునెలల్లోనే తీర్పు వెలువడింది.