Asianet News TeluguAsianet News Telugu

మోదీ ట్వీట్ ఎఫెక్ట్.. రమ్య రాజీనామా..?

సినీనటి రమ్య(దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ గా వ్యవహరించేవారు. 

Ramya resigns as Congress social media cell head, to get some other party post: Sources
Author
Hyderabad, First Published Oct 3, 2018, 3:43 PM IST

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత,  సినీనటి రమ్య(దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ గా వ్యవహరించేవారు. కాగా.. ఇప్పుడు ఆ పదవికి ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం.అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, పార్టీలో వేరే పదవి ఆమెకు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
 
ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను అభ్యంతరకరమైన రీతిలో ట్వీట్‌ చేసినందుకు దివ్య స్పందనపై 'దేశద్రోహం' కేసు నమోదైంది. వివాదాస్పద రఫేల్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలకు మోదీ స్పందించడం లేదని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశ్నించడంతో పాటు మోదీని 'దొంగ'గా అభివర్ణించారు. ఓ ఫోటోను కూడా ట్వీట్‌కు జోడించారు. దీంతో లక్నోకి చెందిన లాయర్ సైయద్ రిజ్వార్ అహ్మద్ ఆమెపై ఫిర్యాదు చేశారు. దివ్యస్పందన ట్వీట్ పరువుదిగజార్చేలా ఉందని, దేశ సార్వభౌమాధికారం, రిపబ్లిక్‌కు ప్రధాని ప్రతినిధి అని, ఆమె స్పందన దేశ ప్రతిష్టను దిగజార్చడమే గాకుండా, దేశ ధిక్కారం కిందకు వస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు 

కాంగ్రెస్ నేత సినీనటి రమ్యపై రాజద్రోహం కేసు

Follow Us:
Download App:
  • android
  • ios