డెహ్రడూన్: అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్‌ బాబాపై ఉత్తరాఖండ్ ఐఎంఏ  రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని  ఐఎంఏ డిమాండ్ చేసింది.  ఈ మేరకు రామ్‌దేవ్  బాబాకు నోటీసులు పంపింది. 

also read:అలోపతిపై వ్యాఖ్యలు : రామ్ దేవ్ బాబాకు హర్షవర్షన్ ప్రశంస.. ‘అదీ ఆయన మెచ్యూరిటీ’ అంటూ కితాబు..

ఆరు పేజీల నోటీసును ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ పంపింది. రాందేవ్‌ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తీరథ్ సింగ్ రావత్ కు ఐఎంఏ లేఖ రాసింది. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.  అల్లోపతి వైద్యం పనికిమాలిన వైద్యం అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను వైద్యులతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడ ఖండించారు. ఈ విషయమై ఆయన రాందేవ్ బాబాకు లేఖ రాశారు. ఆ తర్వాత రాందేవ్ బాబా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొన్నట్టుగా చెప్పారు.