యోగా గురు రాందేవ్ బాబా అలోపతి మీద తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం అతని మెచ్యూరిటీని సూచిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. 

అలోపతి వైద్యం మీద రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వివాదాన్ని మరింత ముదరకుండా నిలిపివేయడం ప్రశంసనీయం అని అది అతని మెచ్యూరిటీని సూచిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆదివారం ట్వీట్ చేశారు. 

అంతేకాదు భారత దేశ ప్రజలు కరోనా మీద ఎలా పోరాటం చేస్తున్నారో ప్రపంచానికి తెలుసు. ఈ పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం.. అన్నారు. 

ఆధునిక వైద్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెంటనే.. ఘాటుగా లెటర్ రాశారు. దీంతో రామ్ దేవ్ బాబా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. 

రామ్ దేవ్ బాబా తన లెటర్ లో "మేము ఆధునిక వైద్య విజ్ఞానాన్ని, అల్లోపతిని వ్యతిరేకించం. అల్లోపతి శస్త్రచికిత్స, ప్రాణాలను రక్షించే విషయంలో అపారమైన పురోగతిని చూపించిందని, అది  మానవాళికి చాలా సేవ చేస్తుందని నమ్ముతామన్నారు. అయితే అది వాలంటీర్ల సమావేశంలో ఓ వాట్సప్ మేసేజ్ చదివే క్రమంలో చదివిందే తప్ప.. ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు. అలా జరిగి ఉంటే క్షమించండి "అని మంత్రికి హిందీలో రాసిన లేఖలో పేర్కొన్నారు. 

అల్లోపతికి వ్యతిరేకంగా రామ్ దేవ్ బాబా చేసిన ఆరోపణలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) శనివారం యోగా గురువు రామ్‌దేవ్‌కు లీగల్ నోటీసు పంపింది. అలోపతి మీద దుష్ప్రచారం చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను పతంజలి యోగ్‌పీత్ ట్రస్ట్ ఖండించింది.

కాగా, ఆలోపతి వైద్యానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రామ్ దేవ్ బాబా వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ట్విటర్ వేదికగా ఆయన ఆ విషయం తెలిపారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలోపతిపై వ్యాఖ్యలు: హర్షవర్ధన్ ఆగ్రహం, వెనక్కి తగ్గిన రామ్ దేవ్ బాబా...

అలోపతి వైద్యులను అవమానించే విధంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఎ) విరుచుకుపడింది. దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 

అలోపతి వైద్యులపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను మంత్రి హర్షవర్ధన్ ఖండించారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచిస్తూ ఆయన రామ్ దేవ్ బాబాకు ఓ లేఖ రాశారు. దాంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు. హర్షవర్ధన్ ను ఉద్దేశిస్తూ తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు. 

"మీ లేఖ నాకు అందింది. వైద్య విధానాలపై నేను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తన్నారు నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను" అని రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు.

ఆధునిక వైద్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు.  హర్షవర్ధన్ కు ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేసిన 8 నిమిషాల తర్వాత రామ్ దేవ్ బాబు మరో ట్వీట్ చేశారు. యోగా, ఆయుర్వేదం పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని, ఆధునిక వైద్య శాస్త్రానికి పరిమతులు ఉన్నాయని ఆయన అన్నారు.