కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ( పౌరసత్వ సవరణ చట్టం)ను వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ... చాలా మంది ఆందోళనలు నిర్వహించారు. కాగా... ఈ చట్టంపై భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సీఏఏపై స్పందించారు.  పౌరసత్వ సవరణ చట్టం బాధ, విషాదం కలిగిస్తోందని సత్య నాదెళ్ల తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన సీఏఏపై కామెంట్ చేశారా లేదంటే భారతీయ పౌరులు ఎవరు, ఎవరు కాదు అనే అంశంపైన అనేది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఓ దేశానికి వలసదారులతో మాత్రం మంచిదని మాత్రం అభిప్రాయపడ్డారు.

Also Read కుక్కల్ని కాల్చినట్టు కాలుస్తాం: బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్...

బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేశారు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. బాధ, విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భారతదేశం వచ్చి.. తదుపరి ఇన్ఫొసిస్ కంపెనీ సీఈవో కావాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. . సత్య నాదెళ్ల వలసదాలరు గురించి మాట్లాడారా..? అక్రమ వలసదారుల గురించి పేర్కొన్నారా అనే అంశంపై క్లారిటీ లేదు. అక్రమ వలసదారుల గురించి కాకుండా.. న్యాయపరంగా వచ్చే వలసదారులతో ఓ దేశ ఉన్నతికి సాయ పడుతుందని అర్థం వచ్చేలా ఉంది. దీంతో ఆ జాతి అభివృద్ధి చెందే వీలుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడి ఉంటారు.