Asianet News TeluguAsianet News Telugu

రామచరితమానస్ ను లోతుగా చదవాలి.. వాదనలు అనవసరం - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్

రామచరితమానస్ పై వాదనలు అనవసరం అని, దానిని లోతుగా చదవాల్సిన అవసరం ఉందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. ప్రతీ దాంట్లో మంచి విషయాలు అంగీకరించాలని తెలిపారు. 

Ramacharitamanas should be read in depth.. Arguments are unnecessary - Chhattisgarh CM Bhupesh Baghel
Author
First Published Feb 4, 2023, 1:27 PM IST

రామచరిత్‌మానస్‌ను లోతుగా చదవాల్సిన అవసరం ఉందని, దానిపై వాదించాల్సిన అవసరం లేదని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ అన్నారు. మంచి విషయాలను అంగీకరించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా రామచరిత్‌మానస్‌పై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

“ ఈ విషయంలో రామాయణం గురించి చెప్పిన వినోబా భావే చెప్పిన మంచి మాటాలను నేను చెప్పాలనుకుంటున్నాను. రామచరితమానస్ గురించి లోతుగా చదవాలి. దాని గురించి వాదించాల్సిన అవసరం లేదు. మంచి విషయాలను అంగీకరించాలి. రెండు, నాలుగు ద్విపదల విషయంలో వివాదం ఉండకూడదు. అందరికీ అన్ని సరిగా ఉండవు.. ప్రతీ వ్యక్తికి దాని సొంత ఎంపిక ఉంటుంది. ’’ అని అన్నారు.

జామియా కేసులో షర్జీల్ ఇమామ్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు.. అయినా జైలులోనే, ఎందుకంటే?

రామాయణంపై వినోబా భావే చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ.. ఏ మతగ్రంథంలోనైనా, ఏ తత్త్వమైనా ఒక నిర్దిష్ట సమయంలో రాయబడి ఉంటుందని ఆయన అన్నారు. నేటి కాలంలో మెరిట్ గురించి చర్చించాలి. సున్నితమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అంగీకరించాలి. దాన్ని యథాతథంగా అంగీకరించాల్సిన అవసరం లేదు’’ అని ఆయన అన్నారు. 

రాముడిని మనం ఏ విధంగానైనా చూడొచ్చని సీఎం అన్నారు. కొందరు ‘మారా మారా’ అని, మరికొందరు ‘రామ్ రామ్’ అంటున్నారని అన్నారు. దీని వల్ల తేడా ఏముటుందని తెలిపారు. ‘మారా, మారా అని పదేపదే ఉచ్చరించినా నోటి నుంచి ‘రామ్ రామ్’ అనే అన్నట్టు వినిపిస్తుంది. కొందరు మారా మాట్లాడతారు. మరికొందరు రామ్ అంటారు. దీంట్లో తేడా ఏముంది. ? మీరు ఆయనను (రాముడిని) ఏ పేరుతో పిలిచినా.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా అందులో రాముడి పేరు ఉంది’’ అని బఘేల్ అన్నారు.

రామచరిత్‌మానస్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్యపై కూడా సీఎం భూపేష్ బఘేల్ మండిపడ్డారు. రామచరితమానస్ కు సంబంధించి ఏ వివాదం జరిగినా అదంతా ఓట్ల కోసమేనని బఘేల్ అన్నారు. ‘‘ఈ వివాదం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లను, మౌర్యతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కూడా సంతోషపెడుతోంది.’’ అని ఆయన ఆరోపించారు. 

ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట సీఆర్‌పీఆఫ్ జవాన్ ఆత్మహత్య.. ఏకే 47తో రెండు రౌండ్లు కాల్చుకుని..!

రామాయణ ఇతిహాసం ఆధారంగా రాసిన రామచరితమానస్ లో కొన్ని కులాలు, వర్గాలను కించపరిచే వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలను తొలగించాలని సమాజ్ వాదీ పార్టీ నేత మౌర్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లో దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసే పదాలు ఉన్నాయని మౌర్య ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios