సారాంశం

 ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారాడు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారాడు. లిక్కర్ స్కాంలోని ఈడీ కేసులో ఆయన అప్రూవర్‌గా మారినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈ కేసులో రామచంద్రపిళ్లై ఆస్తులను ఈడీ అటాట్ చేసింది. అంతేకాదు.. ఈడీ, సీబీఐ కేసులోనూ ఆయన నిందితుడిగా వున్నాడు. 

ALso Read: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం: అఫ్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ఇదే స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారడంతో ఆయన నుంచి ఈడీ కీలక విషయాలు రాబట్టినట్లుగా సమాచారం. అయితే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువమంది సౌత్ గ్రూప్‌నకు చెందినవారే కావడం గమనార్హం.