Kolkata: పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్టు హిందూ సంఘాలు ప్రకటించాయి. విశ్వహిందూ పరిషత్ శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తుండగా, హిందూ జాగరణ్ మంచ్ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 600 చోట్ల మెగా ర్యాలీలతో ఈ పండుగను జరుపుకోనుంది.
Ram Navami mega rallies in West Bengal: పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకోవడానికి, హిందూ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా 600 కి పైగా ప్రదేశాలలో ఊరేగింపులు నిర్వహించాలని యోచిస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తుండగా, హిందూ జాగరణ్ మంచ్ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 600 చోట్ల మెగా ర్యాలీలతో ఈ పండుగను జరుపుకోనుంది. హిందూ జాగరణ్ మంచ్ నాయకుడు దేబాశిష్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, హౌరా ప్రాంతాల్లో పండుగను ఘనంగా జరుపుకుంటామనీ, ర్యాలీలు, ఉత్సవాలు ఉంటాయని చెప్పారు.
"శ్రీరామనవమిని మరింత వైభవంగా జరుపుకుంటాం. దక్షిణ బెంగాల్ లోనే 175 ర్యాలీలు, 600 పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఉత్తర బెంగాల్ లో 170కి పైగా ర్యాలీలు నిర్వహిస్తాం. 60,000 మంది కార్మికులు ఉండే మందిర్ బజార్ లో అతిపెద్ద ర్యాలీ జరుగుతుంది" అని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా హిందూ జాగరణ్ మంచ్ సాయుధ, సాయుధేతర ర్యాలీలు నిర్వహించాలని యోచిస్తోందని దేబాశిష్ చక్రవర్తి తెలిపినట్టు ఇండియా టుడే నివేదించింది. ఆయుధాలతో ర్యాలీలు, సాయుధేతర ర్యాలీలు ఉంటాయని తెలిపారు. చట్టప్రకారం 2018కి ముందు జరిగిన ర్యాలీలు కొనసాగుతాయన్నారు. పాత ర్యాలీల గురించి అయితే అనుమతి అడగాల్సిన అవసరం లేదని, సమాచారం ఇస్తామని చెప్పారు.
ఇది తమ ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. "పాత ర్యాలీలు కొనసాగుతాయని 2018 లో ప్రభుత్వ యంత్రాంగం మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చింది" అని దేబాశిష్ చక్రవర్తి చెప్పారు. బెంగాల్లోని వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న అయోధ్య రామమందిరం శిల్పాల పట్టికలను కూడా హిందూ జాగరణ్ మంచ్ ప్రదర్శిస్తుందని దేబాశిష్ చక్రవర్తి తెలిపారు. చందన్ నగర్, బరాసత్ వంటి వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న రామమందిరం పట్టికలను తీసుకెళ్తామన్నారు.
