Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభమైన రామ మందిర నిర్మాణం: ఐరన్ లేకుండా కన్‌స్ట్రక్షన్

రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీన  రామ మందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
 

Ram Mandir construction starts, no iron will be used: Janmabhoomi Trust
Author
Lucknow, First Published Aug 20, 2020, 3:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


న్యూఢిల్లీ: రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీన  రామ మందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

ఈ ఆలయాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో రామజన్మభూమి ట్రస్ట్ ప్రయత్నిస్తోంది.ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు ఈ ప్రాంతంలో మట్టిని పరీక్షిస్తున్నారు.

పురాతన , సంప్రదాయబద్దంగా ఆలయ నిర్మాణ పనులను చేపడుతున్నారు. భూకంపాలు, తుపానులతో పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోనేలా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. 

also read:అయోధ్య భూమి పూజలో పూజలో మోడీతో వేదిక పంచుకున్న గోపాల్ దాస్ కు కరోనా

రాతి దిమ్మెలను ఒక దానిని మరో దానితో కలపడానికి రాగి పలకలను ఉపయోగిస్తున్నారు. రామ మందిర నిర్మాణంలో ఇలాంటి 10 వేల మందికి పైగా ప్లేట్లు అవసరమని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది.

రాగి పలకాలు 18 అడుగుల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ లోతు ఉండాలని  ట్రస్టు తెలిపింది. రాగి పలకలను ట్రస్టుకు విరాళంగా ఇవ్వాలని కోరారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇనుమును ఉపయోగించడం లేదు. ఇనుము వాడకుండా పురాతన పద్దతుల్లో ఈ ఆలయాన్నినిర్మించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios