లక్నో: రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఛైర్ పర్సన్ మహంత్ గోపాల్ దాస్ కు కరోనా సోకింది. ఈ మేరకు గురువారం నాడు వైద్యులు నిర్ధారించారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రస్ట్ ఛైర్మెన్ గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ తో సీఎం యోగి మాట్లాడారు.

ఆసుపత్రిలో గోపాల్ దాస్ కు తక్షణ వైద్య సహాయం అందించాలని సీఎం యోగి జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన వైద్యులను కూడ ఆదేశించారు.

మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా మేజిస్ట్రేట్ ను ఆయన కోరారు.ఈ నెల 5వ తేదీన రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో గోపాలదాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలదాస్ తో పాటు ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ కూడ పాల్గొన్నారు.

సుధీర్ఘ నిరీక్షణ తర్వాత రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ జరగడం సంతోషంగా ఉందని ఆ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన అభిప్రాయపడ్డారు.