Ayodhya: నీలకంఠ పక్షిని చూడటానికి తరలుతున్న రామ భక్తులు.. ఎందుకంటే?
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తరలివస్తున్న భక్తులు ఒక కొత్త సంప్రదాయానని పాటిస్తున్నారు. ఆగ్రాలో సగం మంది రామ భక్తులు వైల్డ్ లైఫ్‌కు వెళ్లి మరీ నీలకంఠ పక్షిని చూసి వస్తున్నారు.
Lord Ram: అయోధ్య రామ మందిరలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యం సర్వం సిద్ధమైంది. రామ భక్తులూ పెద్ద ఎత్తున అయోధ్యకు తరలివస్తున్నారు. ఈ సందర్బంగా అందులో చాలా మంది ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూడ తరలుతున్నారు.
ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి వెళ్లుతున్నారు. అక్కడ రామాయణంలో పేర్కొన్న నీలకంఠ పక్షిని చూసి వెనక్కి మరలుతున్నారు. రాముడు ఈ పక్షిని చూసిన తర్వాతే లంకాధీశుడిని చంపేసి లంకను తన అదుపులోకి తెచ్చుకున్నట్టు నమ్ముతారు.
పక్షిని చూడాలనే సంస్కృతి పాతదే. తెలంగాణలోనూ ప్రజలు దసరా రోజు న పాలపిట్ట చూడాలని అంటూ ఉంటారు. అందుకోసం ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ పాలపిట్ట పక్షిని వీక్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చూసిన వారు తమకు అదృష్టంగా దాన్ని భావిస్తారు. ఇలాంటిదే.. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చుట్టూ వినిపిస్తున్నది.
Also Read : Ayodhya: రామ మందిర భక్తులకు అందించే మహా ప్రసాదం ఇదే.. ‘లడ్డూ, సరయూ నీరు సహా.. ’
రావణుడిని చంపడానికి ముందు రాముడు ఒక శమీ చెట్టును తాకి.. ఆ తర్వాత నీలకంఠ పక్షి ని చూశాడని చెబుతారు. ఆ తర్వాతే లంకను ఆక్రమించినట్టు అంటుంటారు. అలాగే, నీలకంఠ పక్షిని శివుడి అవతారంగానూ చూస్తారు.