ఉగ్రవాద వ్యతిరేక చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీనిపై ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా.. శుక్రవారం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా బిల్లుపై విపక్షాలు పలు అభ్యంతరాలు, అనుమానాలను వ్యక్తం చేశాయి.

ఈ బిల్లు మామూలు వ్యక్తులను సైతం ఉగ్రవాద ముద్ర వేసేందుకు వీలు కల్పిస్తుందని కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. సవరణ మాత్రమే తీసుకొస్తున్నామని, చట్టాన్ని తీసుకురావడం లేదని వెల్లడించారు.

దీనిని సెలక్ట్ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్ చేయగా.. దానిని ఛైర్మన్ తిరస్కరించారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగిన ఈ బిల్లుకు అనుకూలంగా 147, వ్యతిరేకంగా 42 మంది సభ్యులు ఓటేశారు.