నా జీవితంలో చీకటి రోజు: కరుణానిధి మృతిపై రజనీకాంత్

Rajnikanth on Karunanidhi's demise
Highlights

కరుణానిధి మృతికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది చీకటి రోజు అని ఆయన అన్నారు. తన కలైంగర్ ను పోగొట్టుకున్న ఈ రోజును తాను మరిచిపోలేనని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని రజనీకాంత్ అన్నారు. 

చెన్నై: కరుణానిధి మృతికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది చీకటి రోజు అని ఆయన అన్నారు. తన కలైంగర్ ను పోగొట్టుకున్న ఈ రోజును తాను మరిచిపోలేనని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని రజనీకాంత్ అన్నారు. 

కరుణానిధి గొప్ప నాయకుడని, బలహీనవర్గాల కోసం పనిచేసిన నాయకుడని, దేశానికి ఆయన మృతి తీరని లోటు అని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు 

దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని, డిఎంకె కుటుంబానికి తమ సానభూతిని తెలియజేస్తున్నామని, కాంగ్రెసు ముఖ్యమైన మిత్రుడిని కోల్పోయిందని, ఆయన మృతి ఎవరితోనూ భర్తీ చేయలేమని కాంగ్రెసు నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. 

కరుణానిధి మరణవార్త తనకు తీవ్ర విచారం కలిగించిందని తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళని స్వామి అన్నారు. రాజకీయాలకు, సినిమాలకు, సాహిత్యానికి కరుణానిధి చేసిన సేవలను మరువలేనివని అన్నారు. 

కరుణానిధి మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. కరుణానిధి బహుముఖ వ్యక్తిత్వమని అన్నారు. సుదీర్ఘమైన ప్రజా జీవితంలో కరుణానిధి పలు సవాళ్లను ఎదుర్కున్నారని అన్నారు. 

loader