Asianet News TeluguAsianet News Telugu

రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి పెరోల్

రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలులో శిక్షను అనుభవిస్తున్న నళినికి  30 రోజుల పాటు పెరోలు ఇస్తూ చెన్నై కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

Rajiv Gandhi assassination: Convict Nalini Sriharan gets 30-day parole
Author
Chennai, First Published Jul 5, 2019, 3:17 PM IST

చెన్నై: రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలులో శిక్షను అనుభవిస్తున్న నళినికి  30 రోజుల పాటు పెరోలు ఇస్తూ చెన్నై కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

 ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో నళిని తనకు పెరోల్ ఇవ్వాలని  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.తన కూతురు వివాహం కోసం ఆరు మాసాల పాటు నళిని పెరోలు కోరింది.

కూతురు పెళ్లి కోసం ఏర్పాట్లు చేసేందుకు గాను ఆరు మాసాలు పెరోలు అడిగింది.27 ఏళ్లుగా ఆమె జైలులోనే మగ్గుతోంది. దేశంలో అత్యధికంగా  జైల్లో గడిపిన మహిళ ఖైదీగా నళిని రికార్డుల్లోకెక్కింది.1999 మే మాసంలో రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హత్య చేసింది. రాజీవ్ గాంధీని హత్యచేసిన కేసులో ఏడుగురు నిందితుల్లో నళిని కూడ ఒకరు.

Follow Us:
Download App:
  • android
  • ios