Asianet News TeluguAsianet News Telugu

కాలాకి బ్రేక్.. తూత్తుకుడిలో రజినీకాంత్

బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రజినీ కాంత్

Rajinikanth to visit injured in Tuticorin, calls it a ‘goodwill gesture’

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో ఇటీవల జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటికోరిన్) స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేసిన‌ నేప‌థ్యంలో పోలీసులు కాల్పులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. కాల్పుల్లో 11 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనని తమిళ సినీ పరిశ్రమ కూడా ఖండించింది. 

ఇటీవ‌ల సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఘటనపై తన ట్విట్టర్ లో ఓ వీడియో ద్వారా స్టేట్ మెంట్ ఇచ్చారు. తూత్తుకుడి ఆందోళనకారులని పోలీసులు బుల్లెట్స్ తో బెదరగొట్టడం అవాంచనీయమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. దీనికి తమిళనాడు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ వీడియో ద్వారా తెలిపారు.

కాగా.. బుధవారం ఏకంగా ఆయన తూత్తుకుడికి వచ్చారు. తన కాలా సినిమా ప్రమోషన్స్ ని పక్కన పెట్టేసి ఆయన తూత్తుకుడికి వచ్చారు. ఈ రోజు షెడ్యుల్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయన అక్కడ బాధితులను పరామర్శించనున్నారు. ఆయన అక్కడికి చేరుకున్నారన్న విషయం తెలియగానే.. రజినీ అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios