భారత్ ప్రపంచంలో 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, ప్రధాని మూడో టర్మ్‌లో భారత్ .. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. 

భారత్ ప్రపంచంలో 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, ప్రధాని మూడో టర్మ్‌లో మన దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆయన నేడు బెంగళూరులోని యలహంక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను స్మరించుకునే ఈ కార్యక్రమంలో రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి "పంచ ప్రాణ్" ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి చేసి 2024లో 3వ అతిపెద్ద అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే మోదీ కల అన్నారు. 

దేశాన్ని సంరక్షించడం, రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, దేశభక్తిని పెంపొందించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని పని చేస్తున్నారనీ, అదే దార్శనికతతో ప్రణాళికలను రూపొందిస్తున్నారని తెలిపారు. 2014లో ప్రపంచంలో 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఉన్న భారత్ ను.. నేడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించిందని అన్నారు. 2024 వరకు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్ అవతరించబోతుందని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం (మేరా మాటీ మేరా దేశ్) మన ప్రధాని దార్శనికతకు అనుగుణంగా సాగుతోందనీ, తాము బలమైన భారతదేశాన్ని, సురక్షితమైన భారతదేశాన్ని , అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో కొనసాగించేందుకు తమ ప్రభుత్వం క్రుషి చేస్తున్నమని అన్నారు. మేరా మాటీ మేరా దేశ్ అనే కార్యక్రమం ద్వారా దేశ రక్షణ, దేశ అభివృద్ధి, దేశభక్తి అనే సందేశం ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు. భావి భారత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని అన్నారు. 

ఈ కార్యక్రమం అనంతరం.. యలహంక అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంఘం సభ్యులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. "వసుధా వందన్" కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీ లేదా గ్రామంలో 75 దేశవాళీ చెట్ల మొక్కలను నాటాలని సూచించారు. 2000 నుండి 2010 వరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అత్తూరు సరస్సు, దొడ్డబొమ్మసాంద్ర సరస్సు, యలహంక సరస్సు, చిన్నప్పనహళ్లి సరస్సు, చిన్నప్పనహళ్లి వంటి వివిధ సరస్సులలో వ్యక్తిగతంగా 28,500 మొక్కలను నాటడం లేదా స్పాన్సర్ చేయడం ద్వారా బెంగళూరు పర్యావరణ శ్రేయస్సుకు గణనీయమైన కృషి చేశారు.