కాంగ్రెస్‌కి దోచుకోవడమే తెలుసు.. వక్ఫ్ జేపీసీ భేటీని విపక్షాలు బహిష్కరించడంపై రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు

కర్ణాటకలో జరిగిన భారీ వక్ఫ్ భూమి కుంభకోణం గురించి అన్వర్ మణిప్పాడి నివేదిక వెల్లడించిందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు దాని ద్వారా ఎలా లబ్ధి పొందారో అన్వర్ నివేదిక వెల్లడించిందన్నారు.

Rajeev Chandrasekhar Criticizes Opposition For Boycotting Joint Parliamentary Committee On Waqf Amendment Bill GVR

ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడాన్ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఆక్షేపించారు. కర్ణాటకలో జరిగిన భారీ వక్ఫ్ భూమి కుంభకోణాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కొంతమంది రాజకీయ నాయకులు వక్ఫ్ భూమి కుంభకోణం ద్వారా ఎలా లబ్ధి పొందారో అన్వర్ మణిప్పాడి నివేదిక వెల్లడించిందన్నారు. 

వక్ఫ్ బోర్డులలో పారదర్శకత లేమి, అవినీతిని అన్వర్ మణిప్పాడి నివేదిక బయటపెట్టిందని, పేద ముస్లింలను రక్షించడానికి అవసరమైన సంస్కరణలను అర్థం చేసుకోవడానికి ఈ నివేదిక సహాయపడిందని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. పేద ముస్లింల కోసమే వక్ఫ్ పనిచేయాలని.... కానీ, వక్ఫ్ చేయని వాటిని కూడా వక్ఫ్ అని చెబుతున్నారని ఆరోపించారు.

కాగా, సోమవారం జరగాల్సిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బహిష్కరించారు. కర్ణాటక రాష్ట్ర మైనారిటీ కమిషన్, కర్ణాటక మైనారిటీ అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ అన్వర్ మణిప్పాడి ఇంకా బిల్లు ప్రజెంటేషన్ ఇస్తున్నారని... ఇది వక్ఫ్ బిల్లు గురించి కాదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలపై అన్వర్ మణిప్పాడి అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఇది ఎంత మాత్రం మోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు.

దీనిపై రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. కర్ణాటకలో భారీ వక్ఫ్ భూముల కుంభకోణం ద్వారా కొందరు రాజకీయ నాయకులు ఎలా లబ్ధి పొందారో అర్థం చేసుకున్న వ్యక్తి అన్వర్ మణిప్పాడి అని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా చేసే మొదటి పని.. వారి కుటుంబాల కోసం భూమిని లాక్కోవడమని విమర్శించారు. అలాగే, బెంగళూరులోని విలువైన చెరువులను ఆక్రమించడానికి "స్నేహపూర్వక" బిల్డర్లను అనుమతించడమన్నారు. ఈ పరిస్థితిని బీఎస్ బొమ్మై, యడ్యూరప్పల హయాంలో మార్చారన్నారు. వారు చెరువులను రక్షించి పునరుద్ధరించారని పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios